E-Paper
Advertisement

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్

Nara Lokesh: మంత్రి లోకేష్ సరికొత్త రికార్డ్.. 4వేలమందితో ప్రజా దర్బార్.. ప్రతి ఒక్కరితో వన్ టు వన్ ఇంటరాక్షన్
Advertisement

యువగళంతో మార్పు చూపించిన నారా లోకేష్, కూటమి ప్రభుత్వంలో కీలకంగా మారారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తోపాటు ప్రభుత్వంలో నారా లోకేష్ కూడా చొరవగా పనిచేస్తున్నారు. అదే సమయంలో ఆయన టీడీపీ కార్యకలాపాల్లో కూడా చురుగ్గా పాల్గొంటున్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 70వ రోజు ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. తనను కలవడానికి వచ్చిన ప్రతి ఒక్కరినీ పలకరించి ఆ తర్వాతే ఇంటికి వెళ్లారు.

Advertisement

4వేలమంది..
అధికారంలో లేనప్పుడు ఎన్నివేలమందినైనా ఒకేరోజులో కలుస్తుంటారు నేతలు. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నేతలకు, కార్యకర్తలకు కూడా అపాయింట్ మెంట్ లు కరువవుతుంటాయి. అలాంటిది ఒకే రోజు 4వేలమందితో వన్ టు వన్ ఇంటరాక్షన్ అంటే మాటలు కాదు. 4వేలమంది వచ్చినా కూడా లోకేష్ మధ్యలో వెనుదిరగలేదు. అందరినీ కలసి, వారి సమస్యలు విని, పరిష్కారం దిశగా హామీ ఇచ్చి పంపించారు. వచ్చిన ప్రతి ఒక్కరితో ఫొటో దిగారు. దాదాపు 4 గంటలకు పైగా ఈ కార్యక్రమం కొనసాగింది.

ప్రజా దర్బార్ అనే పేరుతో నాయకులు వినతిపత్రాలు స్వీకరించే కార్యక్రమాలు చాలానే చూస్తుంటాం. ఒకరిద్దరు, లేదా ఒక 10మంది దగ్గర అర్జీలు తీసుకుని, తర్వాత వారందర్నీ గ్రూపుగా ఒక చోటకు చేర్చి అధికారులు, లేదా నాయకులతో వాటిని సేకరిస్తారు. ఆ తర్వాత గ్రూప్ గా అందరికీ అధినాయకుడు ఒకేసారి హామీ ఇస్తుంటారు. కానీ ఇక్కడ అలా కాదు. లోకేష్ ఓపికగా అందరి సమస్యలు విడివిడిగా విన్నారు. అందర్నీ విడివిడిగానే కలసి వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. దాదాపుగా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఈ కార్యక్రమం నుంచి వెనుదిరిగారని అంటున్నారు. సమస్య పరిష్కారం అయ్యేది తర్వాతే అయినా, ముందుగా లోకేష్ నుంచి ఆ స్థాయిలో భరోసా లభించిందని, అది చాలని చాలామంది అంటున్నారు. వారందరి సంతోషమే తమ పార్టీకి శ్రీరామ రక్ష అంటున్నారు టీడీపీ నేతలు.

Advertisement

ఓవైపు మంత్రిగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటూనే, మరోవైపు పార్టీ కార్యాలయంలో నిత్యం నేతలు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్నారు లోకేష్. అధికారంలో ఉన్నప్పుడు జగన్ ఇలాంటి పనులు అస్సలు చేయలేదనే విమర్శలు వైసీపీ నుంచే వినపడేవి. కనీసం పార్టీ నేతల్ని కలిసేవారు కాదని, ఎమ్మెల్యేలకు కూడా అపాయింట్ మెంట్లు దొరికేవి కాదని అంటుంటారు. కానీ లోకేష్ ఆ తప్పు చేయడం లేదని, నిత్యం పార్టీ నేతలకు, సామాన్య ప్రజలకు కూడా అందుబాటులో ఉంటున్నారని, ప్రభుత్వం తమకు అండగా ఉందనే భరోసా వారికి కల్పిస్తున్నారని చెబుతున్నారు.

సమస్యల ఏకరువు..
వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు తమకు అన్యాయం జరిగిందని, ఇప్పుడైనా న్యాయం చేయాలని రాష్ట్రవ్యాప్తంగా బాధితులు కొందరు లోకేష్ ప్రజా దర్బార్ లో విన్నవించుకున్నారు. టీడీపీ సానుభూతిపరులనే ముద్ర పడటంతో అన్యాయంగా తమ పొలాలు లాగేసుకున్నారని, ఉద్యోగాల్లో తమను ఇబ్బంది పెట్టారని చాలామంది లోకేష్ కి ఫిర్యాదు చేశారు. వారందరికీ అండగా ఉంటామని లోకేష్ మాటిచ్చారు.

Also Read: అప్పుడు పరదాల్లో, ఇప్పుడు పొలాల్లో.. ఏంటి జగన్ ఇది!

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×