BigTV English

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Rahul Gandhi: భారత్‌లో కూడా జెన్- Z ఉద్యమం వస్తుంది.. రాహుల్ గాంధీ సంచలన ట్వీట్

Rahul Gandhi: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సంచలన ట్వీట్ చేశారు. భారతదేశంలో కూడా జెన్- జెడ్ ఉద్యమం వస్తుందని సెన్సెషనల్ పోస్ట్ చేశారు. ఓట్ చోరీపై యువత, స్టూడెంట్స్ తిరుగుబాట్ చేస్తారని.. యువతతో కలిసి రాజ్యాంగాన్ని కాపాడతానని రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. అంతకు ముందు రాహుల్ గాంధీ భారత ఎన్నికల సంఘంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.


దేశంలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న ప్రాంతాల నుంచి ఓట్లను తొలగించారని సంచలన ఆరోపణలు చేశారు. ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం బయట నుంచి ఫేక్ లాగిన్స్, మొబైల్ నంబర్లను ఉపయోగించి ఓటర్ ఐడీలను తీసి వేసినట్టు ఆయన ఆరోపణలు చేశారు. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో రాహల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు.

పలు రాష్ట్రంలో ఓట్ల తొలగింపు ప్రక్రియను మనుషుల తో కాకుండా ప్రత్యేక సాఫ్ట్ వేర్ ను ఉపయోగించి ఓట్లను తీసివేస్తున్నారని చెప్పారు. అదంతా ఓ పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతోందని ఆరోపణలు చేశారు. ప్రతి పక్ష పార్టీలకు ఓట్లు వేసే ప్రజలను, కమ్యూనిటీని గుర్తించి వారిని లక్ష్యంగా ఇదంతా జరుగుతోందని చెప్పారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నట్టు చెప్పారు. తాము వంద శాతం ఆధారాలను గుర్తించిన తర్వాతనే మాట్లుడుతున్నామని అన్నారు.

ALSO READ: Hyderabad ECIL: మన హైదరాబాద్‌లో ఉద్యోగాలు.. ఇలాంటి ఛాన్స్ మిస్ చేసుకోవద్దు.. మంచి వేతనం

తాను ఈ దేశాన్ని.. రాజ్యాంగాన్ని ప్రేమిస్తున్నానని చెప్పారు. ఈ ప్రజాస్వామ్య ప్రక్రియను తాను ఇష్టపడుతున్నట్టు వ్యాఖ్యానించారు. ఈ ప్రక్రియను రక్షిస్తున్నట్టు పేర్కొన్నారు. కర్నాటక రాష్టంలో అలంద్ లో ఆరు వేల ఓట్లను తీసి వేసే ప్రయత్నం జరిగిందని.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. దీనికి సంబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని చెప్పారు.

ALSO READ: Asia Cup 2025 : పాకిస్తాన్ ను గడగడలాడించిన UAE ప్లేయర్.. ఇండియా నుంచి వెళ్లి… నరకం చూపించాడు

దేశంలో ఓట్ల చోరీకి పాల్పడే నాయకులను ఎన్నికల సంఘం ఎళ్ల వేళలా రక్షిస్తోందని.. ఈ వ్యవహారంపై విచారణ జరపాలని అన్నారు. అయితే దేశంలో ఈ వ్యవహారం పై విచారణ చేయాలని అభ్యర్థనలను ఎలక్షన్ కమిషన్ చీఫ్ విస్మరిస్తున్నారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఇది హైడ్రోజన్ బాంబు కాదని.. దానిని తాము త్వరలోనే పేలుస్తామని చెప్పుకొచ్చారు. ఈ విమర్శలను కేంద్ర ఎన్నికల సంఘం, బీజేపీ తీవ్రంగా ఖండించింది.

Related News

Air India Flight: విశాఖ – హైదరాబాద్ విమానానికి.. తృటిలో తప్పిన ప్రమాదం

Uttarakhand Floods: ఉత్తరాఖండ్‌లో మళ్లీ వరద బీభత్సం.. కొండచరియలు విరిగి 10 మంది గల్లంతు

Kerala: కేరళలో కొత్త వైరస్.. 100 మందికి పైగా..?

Rahul Gandhi: ఎన్నికల సంఘంపై రాహుల్‌ విసుర్లు.. ఆధారాలు ఇవిగో, కీలక విషయాలు వెల్లడి

Narendra Modi: మోదీ @ 75.. ఫిట్ నెస్ సీక్రెట్స్.. ఆ శక్తి వెనుక రహస్యాలు..

Modi Assets: 75 ఏళ్లుగా మోదీ సంపాదన ఇంతేనా? ఆయన ఎక్కడ పొదుపు చేస్తారు?

Election Commission: ఈవీఎంలపై ఈసీ సంచలన నిర్ణయం.. ఇక గుర్తులతో పాటు అభ్యర్థుల కలర్ ఫోటోలు..

Big Stories

×