Regina Cassandra (Source: Instragram)
2012లో వచ్చిన శివ మనసులో శృతి సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది రెజీనా కాసాండ్రా. ఆ తర్వాత రొటీన్ లవ్ స్టోరీ, కొత్తజంట సినిమాలలో నటించి, తన పాత్రలతో ఆకట్టుకుంది.
Regina Cassandra (Source: Instragram)
తన నటనతో తెలుగులోనే కాకుండా కన్నడ, తమిళ్ భాషలలో కూడా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ.. 1988 డిసెంబర్ 13న తమిళనాడు, చెన్నైలో జన్మించింది.
Regina Cassandra (Source: Instragram)
సినిమాలలోనే కాదు పలు వెబ్ సిరీస్లలో కూడా నటించి, పలు పురస్కారాలు కూడా సొంతం చేసుకుంది.
Regina Cassandra (Source: Instragram)
ఇకపోతే ప్రస్తుతం ఈమె చేతిలో చాలా చిత్రాలే ఉన్నాయి. ముఖ్యంగా నాలుగు తమిళ్ చిత్రాలు, ఒకటి మలయాళం, ఒకటి హిందీ సినిమా ఉండడం గమనార్హం.
Regina Cassandra (Source: Instragram)
ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఈమె మరొకసారి ఫ్రెష్ ఫేస్ తో కనిపించి అందరి దృష్టిని ఆకట్టుకుంది.
Regina Cassandra (Source: Instragram)
అంతేకాదు ఈ ఫ్రెష్ ఫేస్ కి కారణం తాను తయారు చేసే ఓట్ మిల్క్ కాఫీ అంటూ ఫ్రెష్ ఫేస్ రహస్యాన్ని కూడా రివీల్ చేసింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం చుడీదార్ లో దర్శనమిచ్చి ఇంస్టాగ్రామ్ వేదికగా ఆ ఫోటోలను షేర్ చేసింది.