Janhvi Kapoor (Source: Instragram)
78వ కేమ్స్ ఫిలిం ఫెస్టివల్ అత్యంత ఘనంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ప్రపంచం నలుమూలల ఉండే అందమైన యువతులందరూ కూడా ఈ రెడ్ కార్పెట్ పై తమ అందాలతో దర్శనమిస్తున్నారు.
Janhvi Kapoor (Source: Instragram)
ఒక్కొక్కరు ఒక్కో స్పెషాలిటీ.. తన అందాన్ని చూపిస్తూ.. తమ అందంతో ప్రపంచాన్ని తమ వైపు తిప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ రెడ్ కార్పెట్ పై ఎంతోమంది హీరోయిన్లు సందడి చేశారు.
Janhvi Kapoor (Source: Instragram)
అందులో భాగంగానే తాజాగా జాన్వి కపూర్ కూడా తన అందంతో ఆకట్టుకుంది. అసలు విషయంలోకి వెళ్తే.. కేన్స్ ఫిలిం ఫెస్టివల్ లో 'హోమ్ బౌండ్' సినిమా ప్రీమియర్ కి హాజరయ్యింది ఈ ముద్దుగుమ్మ.
Janhvi Kapoor (Source: Instragram)
ఈ కార్యక్రమం కోసం అనామికా ఖన్నా డిజైన్ చేసిన గౌన్ ధరించింది. ఈ గౌను ను అత్యంత క్లిష్టమైన ఎంబ్రాయిడరీ తో డిజైన్ చేశారు . యోక్ భాగాన్ని గోల్డెన్ కార్సెట్ తో డిజైన్ చేయగా.. కింద పిస్తా గ్రీన్ కలర్ లో ఆర్గాన్జ స్కర్ట్ అటాచ్ చేసారు.
Janhvi Kapoor (Source: Instragram)
ఇక ఈ గౌన్ బ్యాక్ లెస్ కావడం గమనార్హం.. వెనుక వీపు అందాలు చూపిస్తూ ముత్యాలు ఉన్న ఒక హారాన్ని ఆమె ధరించింది. అలాగే ఇయర్ కప్, బ్యాంగిల్స్, జుంకాలు అన్నీ కూడా వింటేజ్ ఇండియన్ నగలను ధరించడం గమనార్హం.
Janhvi Kapoor (Source: Instragram)
ఈ అందమైన డ్రెస్ లో ఈమెను చూడడానికి ప్రపంచం కళ్ళు సరిపోవేమో అని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు అంత అందంగా కనిపిస్తోంది జాన్వీ కపూర్.