Divi Vadthya(Source: Instragram)
దివి వైద్య.. ఈమె గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మోడల్ గా కెరియర్ ఆరంభించిన ఈమె.. 2019లో వచ్చిన మహర్షి సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది.
Divi Vadthya(Source: Instragram)
1996 మార్చి 15న హైదరాబాదులో జన్మించిన ఈమె.. పదవ తరగతి వరకు జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో చదివింది. జీ.నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి ఎంబీఏ పూర్తి చేసింది.
Divi Vadthya(Source: Instragram)
సినిమాల మీద మక్కువతో 2017లో మోడలింగ్ లోకి అడుగుపెట్టిన ఈమె, పలు ఫ్యాషన్ సంస్థలకు మోడల్ గా కూడా పనిచేసింది
Divi Vadthya(Source: Instragram)
2018లో తొలిసారిగా లెట్స్ గో అనే షార్ట్ ఫిలింలో నటించింది. ఆ తర్వాత మహర్షి ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యింది.
Divi Vadthya(Source: Instragram)
బిగ్‌బాస్ సీజన్ ఫోర్లో పాల్గొన్న దివి 49 రోజులపాటు హౌస్ లో ఉండి ఆ తర్వాత ఎలిమినేట్ అయ్యింది.
Divi Vadthya(Source: Instragram)
చివరిగా అల్లు అర్జున్ పుష్ప 2, బాలకృష్ణ డాకు మహారాజ్ సినిమాలలో నటించిన దివి ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు ఫోటోలు షేర్ చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా కోయ జాతి అమ్మాయిగా కనిపించిన ఈమె.. డాకు మహారాజ్ లో గెటప్‌తో ఆకట్టుకుంది.