Hansika Motwani: బబ్లీ బ్యూటీ హన్సిక మోత్వానీ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

బాలనటిగా బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సినిమాలో నటించి మెప్పించిన హన్సిక .. తెలుగులో దేశముదురు సినిమాతో తెలుగుతెరకు పరిచయమైంది .

మొదటి సినిమాతోనే టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారిన హన్సిక స్టార్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది.

ఇక హన్సిక కెరీర్ పీక్స్ లో ఉండగానే తన స్నేహితుడు సోహైల్ ను వివాహమాడింది. అతనికి ఇది రెండో వివాహం. వీరి పెళ్లి వేడుక డాక్యుమెంటరిగా కూడా వచ్చింది.

ఇక పెళ్లి తరువాత ఎక్కువ లేడీ ఓరియెంటెడ్ సినిమాలకు ప్రిఫరెన్స్ ఇచ్చిన హన్సిక ప్రస్తుతం అడపాదడపా సినిమాల్లోనే కనిపిస్తుంది.

ప్రస్తుతం హన్సిక ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తోంది. తెలుగు ప్రేక్షకులకు ఆమె ఈ ఢీ షో ద్వారా మరింత గుర్తింపు తెచ్చుకుంది.

ఇక సినిమాలు పక్కన పెడితే సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోతకు పెట్టింది పేరు. అంతకు ముందు బొద్దుగా ఉన్న ఈ భామ తగ్గి మరింత అందంగా కనిపించింది.

చక్కన్నమ్మ చిక్కినా అందమే అన్నట్లు.. హన్సిక తాజా ఫోటోషూట్ లో అందంతో అదరగొట్టేసింది.

బ్లాక్ డిజైనర్ డ్రెస్ లో ఒక స్టూల్ మీద నిలబడి శిల్పంలా నిలబడి ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.