Delhi blast Update: ఢిల్లీలో రెడ్ ఫోర్టు సమీపంలో జరిగిన పేలుడు ఘటనపై దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు. పేలుడుకి సంబంధించి ఐ-20 కారు- పుల్వామా ప్రాంతంతో సంబంధం ఉన్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు లభించిన ఆధారాలు మేరకు పుల్వామాకు చెందిన తారిఖ్ ఈ కారుని కొనుగోలు చేశాడు.
ఎర్రకోట వద్ద పేలుడు ఘటనలో కొత్త విషయాలు
ఘటనకు ముందు ఐ20 కారుకి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. హ్యుందాయ్ ఐ20 కారులో ఈ పేలుడు జరిగినట్లు పోలీసుల అంచనా.పేలుడుకి మూడు గంటల ముందు ఓ వ్యక్తి కారు నడుపుతున్న దృశ్యాలను వెలుగులోకి వచ్చాయి. ఫేస్‌కు మాస్క్ ధరించాడు.
డాక్టర్ మహ్మద్ ఉమర్‌గా అనుమానిస్తున్నట్లు సమాచారం. కారులో మరణించిన వ్యక్తి ఎవరో నిర్ధారించేందుకు పోలీసులు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించారు. తద్వారా ఆ వ్యక్తి డాక్టర్ మొహమ్మద్ అవునా అనే విషయం తేలనుంది. అతడికి-ఫరీదాబాద్ మాడ్యూల్‌తో సంబంధాలు ఉన్నట్లు అధికార వర్గాలు భావిస్తున్నాయి.
ఐ 20 కారు ముగ్గురు ఓనర్ల చేతులు మారిందా?
తెల్లటి హ్యుందాయ్ i20 కారు ఎర్రకోట సమీపంలో మధ్యాహ్నం 3.19 గంటలకు నిలిపివేశారు. సాయంత్రం 6.48 గంటలకు పార్కింగ్ ప్రాంతం నుంచి బయలుదేరింది. ఢిల్లీలో టోల్ ప్లాజాల నుండి వచ్చిన 100 కి పైగా వాహనాల సీసీటీవీ ఫుటేజ్ లను పరిశీలించారు అధికారులు. వాహనం ఆ ప్రదేశానికి చేరుకోవడానికి ముందు, ఆ తర్వాత దాని ప్రయాణించే మార్గాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఐ 20 కారు పార్కింగ్ ప్రాంతానికి వచ్చిన దగ్గర నుంచి వెళ్లే వరకు క్షుణ్ణంగా పరిశీలన చేస్తున్నారు. ఆ సమయంలో పార్కింగ్ వద్దనున్న అటెండర్లను ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తున్నారు. ఆ కారులో వచ్చిన వ్యక్తిని ఎవరు చూశారు? అందులో ఇంకా ఎవరైనా ఉన్నారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.
ALSO READ: ఎర్రకోట పేలుడు.. చిక్కిన కారు ఓనర్, సొంతూరు పుల్వామా వాసి
పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీసుల దర్యాప్తులో జమ్మూ కాశ్మీర్‌కు చెందిన తారిక్-ఉమర్ మొహమ్మద్ ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తారిక్ పేరు మీద కారు ఉంది. అతడికి- ఉమర్ మొహమ్మద్ మధ్య సంబంధాలను గుర్తించడంపై ఫోకస్ చేశారు. వాహనం ఉపయోగించడం వెనుకున్న ఉద్దేశ్యాన్ని తెలుసుకోవడానికి లోతుగా దర్యాప్తు జరుగుతోంది.
పేలుడు ఘటనకు కీలకమైన i20 కారు సల్మాన్ అనే వ్యక్తికి చెందినది. పోలీసులు అతడ్ని అదుపులోకి విచారించారు. ఆ కారుకి హర్యానా నెంబర్ ప్లేట్ ఉంది. సల్మాన్ ఆ కారుని ఢిల్లీలోని ఓఖ్లా నివాసి దేవేంద్ర అనే మరో వ్యక్తికి విక్రయించినట్లు దర్యాప్తులో తేలింది.
దేవేంద్ర ఆ కారును హర్యానాలోని అంబాలాకు చెందిన మరొక వ్యక్తికి విక్రయించాడు. సల్మాన్ ఆ కారుకి సంబంధించిన అన్ని పత్రాలను పోలీసులకు అప్పగించాడు. కారు అసలు యజమానిని గుర్తించడానికి ప్రాంతీయ రవాణా కార్యాలయం అధికారులతో కలిసి దర్యాప్తు చేస్తున్నారు అధికారులు.
ఇంతకీ ఈ కారుని దొంగలించి రిజిస్ట్రేషన్ చేయించారా? లేకపోతే ముగ్గురు ఓనర్లు ఎలా మారారు? సొంత కారు అయితే ఢిల్లీ నుంచి హర్యానా వరకు వెళ్లింది. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామా ప్రాంతానికి చెందిన తారిఖ్.. హర్యానాలో కారుని ఎలా రిజిస్ట్రేషన్ చేయించాడు? ఈ చిక్కుముడి వెనుక తేల్చాల్సిన సమాధానాలు చాలానే ఉన్నాయి.
ఢిల్లీ పేలుడు ఘటన.. వెలుగులోకి కారు సీసీటీవీ దృశ్యాలు
ఇంటెలిజెన్స్ ఏజెన్సీల సమాచారం మేరకు పేలుడు ఘటన ఉగ్రదాడిగా నిర్ధారణ
కారులో పేలుడు పదార్థం అమర్చి విస్ఫోటనం
ఇది ఫిదాయిన్ దాడి అయి ఉండొచ్చని ఏజెన్సీలకు అనుమానం
కారులో మరణించిన వ్యక్తి ఎవరో నిర్ధారించేందుకు డీఎన్‌ఏ పరీక్షలు pic.twitter.com/Qeydu5DPS4
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025
పేలుడు ఘటనపై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్‌కు పలు కీలక ఆధారాలు
పేలుడు సంభవించిన కారు పుల్వామాకు చెందిన తారిక్ కొనుగోలు చేసినట్లు సమాచారం
ఈ కేసుకు ఫరీదాబాద్ ఉగ్ర మాడ్యుల్‌కి సంబంధముందని అనుమానం
ప్రస్తుతం పరారీలో ఫరీదాబాద్ మాడ్యుల్‌కు చెందిన ఉగ్రవాది డాక్టర్ ఉమర్ మహ్మద్ pic.twitter.com/LAXS1Fxvcs
— BIG TV Breaking News (@bigtvtelugu) November 11, 2025