E-Paper
Advertisement

MM Keeravani: కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన శృతిహాసన్.. అందుకే ఆస్కార్ గ్రహీత అంటూ!

MM Keeravani: కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన శృతిహాసన్.. అందుకే ఆస్కార్ గ్రహీత అంటూ!
Advertisement

MM Keeravani:ప్రముఖ స్టార్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కమలహాసన్ (Kamal Haasan) కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శృతిహాసన్(Shruti Haasan). ‘అనగనగా ఓ ధీరుడు’ సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె పెద్దగా ప్రేక్షకులను అలరించలేకపోయింది. తర్వాత తమిళ్ , తెలుగు అంటూ పలు చిత్రాలలో నటించిన శృతిహాసన్.. తెలుగులో హరీష్ శంకర్ ( Harish Shankar) దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా వచ్చిన ‘ గబ్బర్ సింగ్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత పలు చిత్రాలు చేస్తూ వచ్చిన ఈమె కొంతకాలం ఇండస్ట్రీకి గ్యాప్ తీసుకొని.. మళ్ళీ ప్రభాస్(Prabhas ) ‘సలార్’ సినిమాతో గట్టి కంబ్యాక్ ఇచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలు చేస్తూ బిజీగా మారిన శృతిహాసన్.. ఒకవైపు హీరోయిన్ గానే కాకుండా సింగర్ గా కూడా తన సత్తా చాటుతూ దూసుకుపోతోంది.

కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పిన శృతిహాసన్..

ఈ క్రమంలోనే దిగ్గజ దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli ) దర్శకత్వంలో మహేష్ బాబు (Mahesh Babu) హీరోగా.. ప్రియాంక చోప్రా (Priyanka Chopra) హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ఎస్ ఎస్ ఎం బి 29. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానుల కోసం రాజమౌళి హైదరాబాదులోని రామోజీ ఫిలింసిటీ వేదికగా గ్లోబ్ ట్రోటర్ అంటూ అతిపెద్ద వేడుకను నిర్వహించనున్నారు. నవంబర్ 15వ తేదీన జరగబోయే ఈవెంట్ కి సుమారుగా లక్ష మంది వస్తారని మేకర్స్ అంచనాలు వేస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ గ్లోబ్ ట్రోటర్ కోసం తన గాత్రాన్ని వినిపించిన శృతిహాసన్.. అందులో భాగంగానే ఈ చిత్ర సంగీత దర్శకుడు.. ఆస్కార్ గ్రహీత ఎంఎం కీరవాణి(MM Keeravani) సక్సెస్ సీక్రెట్ రివీల్ చేసి అందరిని ఆశ్చర్యపరిచింది.

Advertisement

also read:Shiva Re release: అప్పట్లోనే అన్ని కోట్ల కలెక్షన్స్.. సృష్టించిన రికార్డ్స్ ఇవే!

అందుకే ఆస్కార్ గ్రహీత..

అసలు విషయంలోకి వెళ్తే.. మ్యూజిక్ స్టూడియోలో కీరవాణి కీస్ ప్లే చేస్తూ ఉండగా తన అద్భుతమైన గాత్రాన్ని వినిపించిన శృతిహాసన్.. స్టూడియో నుండి అందుకు సంబంధించిన ఫోటో ని రిలీజ్ చేస్తూ.. ఆయన సక్సెస్ సీక్రెట్ గురించి కూడా బయట పెట్టింది. శృతిహాసన్ ఆ పోస్టులో.. “కీరవాణి సార్ సంగీతానికి నేను పాడడం చాలా సంతోషంగా ఉంది. ఇది చాలా శక్తివంతమైన ట్రాక్. ఆయనతోపాటు స్టూడియోలో నేను సైలెంట్ గా కూర్చుని సార్ ప్లే చేస్తున్న కీస్ వింటున్నాను. ఏదైనా ప్రారంభించే ముందు ఆయన సాధారణంగా విఘ్నేశ్వర మంత్రంతో తన సెషన్లను ప్రారంభిస్తానని చెప్పాడు. ఇక నేను కూడా అందుకోసం ఎదురు చూడగా ఆ తర్వాత ఆయన అప్పాస్ పాట ప్లే చేశారు. ఆ క్షణం చాలా ప్రత్యేకమైనది. సార్ మీ దయ ఈరోజు మొత్తం బృందం నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు.. ఇక ట్రాక్ వినడానికి వేసి ఉండలేను” అంటూ తెలిసింది. శృతిహాసన్ చెప్పిన ఈ మాటలపై నెటిజన్లు స్పందిస్తున్నారు.

నెటిజన్స్ కామెంట్లు..

Advertisement

ఎం.ఎం.కీరవాణి మొదటి ఆరాధ్య దైవమైన వినాయకుడికి పూజ చేసి ప్రతి సినిమాకు సంగీతం అందిస్తున్నారు అని తెలిసి.. అందుకే ఆయన కెరియర్లో విఘ్నాలు లేకుండా ముందుకు వెళుతున్నారు. అందుకే కదా ఆయన ఏకంగా ఆస్కార్ గ్రహీత అయిపోయారు అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం శృతిహాసన్ ఆయన సక్సెస్ సీక్రెట్ చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

Related News

‘ఇరుముడి’ రూ.200 కోట్ల దెబ్బ! ఇప్పుడు శివ నిర్వాణ వెనక పడుతున్న స్టార్ హీరోలు!

మళ్లీ వార్తల్లోకి పూనం పాండే.. ఈసారి వ్యభిచారంపై మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

ముంబైని షేక్ చేస్తున్న అనన్య పాండే గ్లామర్ షో.. ఆ పిక్స్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

తెలుగు హీరోలంటే క్రిమినల్స్, స్మగ్లర్స్.. టాలీవుడ్ సినిమాలపై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

కళ్ళు చెదిరే అందం.. వరుస ఆఫర్స్.. మరి సక్సెస్ రేట్ ఎక్కడ చిట్టి?

అదంతా ఫేక్ ఎవరు మోసపోవద్దు.. స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ!

సరికొత్త రికార్డు సృష్టించి’ఏష నాగుల’…తొలి తెలుగు పాటగా !

విడాకులు తీసుకున్న దునియా విజయ్.. భరణం తెలిస్తే షాక్!

Big Stories

Advertisement
×