
Sree Mukhi (Source: Instragram)
శ్రీముఖి.. అద్భుతమైన వాక్చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ చిన్నది సినిమాలలో నటించి అక్కడ సక్సెస్ కాక బుల్లితెర వైపు అడుగులు వేసింది.

Sree Mukhi (Source: Instragram)
పటాస్, అదుర్స్ వంటి షోలతో ప్రేక్షకులను మెప్పించిన ఈమె ఆ తర్వాత పెద్దపెద్ద ఈవెంట్లకి కూడా ఇప్పుడు హోస్టుగా వ్యవహరించే స్థాయికి ఎదిగింది.

Sree Mukhi (Source: Instragram)
అంతేకాదు ఆలీతో కలిసి అవార్డు ఈవెంట్లకి కూడా ఈమె హోస్ట్ గా చేసి ఆకట్టుకుంది. ప్రస్తుతం పలు షోలలో పాల్గొంటూ సందడి చేస్తున్న శ్రీముఖి తాజాగా పెళ్లి ఫోటోలను షేర్ చేసింది.

Sree Mukhi (Source: Instragram)
తాజాగా షేర్ చేసిన ఫోటోలలో శ్రీముఖి మెరూన్ రెడ్ కలర్ లెహంగా ధరించి.. అందుకు తగ్గట్టుగా జువెలరీ ధరించింది. సాంప్రదాయ పద్ధతిలో యువరాణిగా అభిమానులను ఆకట్టుకుంటుంది.

Sree Mukhi (Source: Instragram)
ఇక తాజాగా శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.

Sree Mukhi (Source: Instragram)
మొత్తానికైతే శ్రీముఖి షేర్ చేసిన ఈ ఫోటోలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఈమె స్టార్ మా పరివారం షోలో హోస్ట్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.