Intinti Ramayanam Today Episode November 11th : నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రధర్ని చూసి మీనాక్షి భయపడిపోతూ ఉంటుంది.. నువ్వు నా భార్యవని అందరికీ చెప్పాలని వచ్చావా అని బెదిరిస్తూ ఆమెని చంపబోతాడు. ఆ విషయం చూసిన అవని చక్రధరిపై అక్కడున్న ట్రైని విసిరేసి తల్లిని కాపాడుకుంటుంది. రేయ్ అంటూ కోపంగా లోపలికి వచ్చిన అవని చక్రధర్ ను అక్కడున్న ట్రే తో కొట్టి పక్కకి తోసేస్తుంది.. మా అమ్మని చంపబోతావని సెలెన్స్ స్టాండ్ తీసుకొని కొట్టబోతుంది. మీనాక్షి అవనిని అడ్డుకుంటుంది. అవని ఆగమ్మ అతని నా భర్త నీ కన్న తండ్రి అని చెప్పేస్తుంది.
దాంతో అవని ఒక్కసారిగా షాక్ అవుతుంది. తన తండ్రి చక్రధర్ తెలుసుకొని అవని టెన్షన్ పడుతుంది. అవునమ్మా నేను చెప్పేది నిజమే ఈ దుర్మార్గుడు మీ కన్న తండ్రి.. వీడంటే అసహ్యం వేసే నేను మీకు చెప్పలేదు.. వీడు ఒక దుర్మార్గుడు కాబట్టే వీడి గురించి మీకు చెప్పాలని అనుకోలేదు అందుకే ఇన్ని రోజులు మీ తండ్రి గురించి మీకు నిజం చెప్పలేదు అని అంటుంది.. ఇంటికి వెళ్ళగానే పల్లవికి మీ సొంత అక్కని అవని అంటుంది. పల్లవి దారుణంగా మాట్లాడడంతో మీనాక్షి చంప పగలగొడుతుంది.. ఎలాగైనా సరే మీనాక్షిపై రెవెన్యూ తెచ్చుకోవాలని అనుకుంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. అవని అక్షయ్ నాకు సపోర్టుగా ఉన్నాడని లోపల సంతోష పడుతూ ఉంటుంది.. మీకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను అండి మీరు నాకు ఇప్పటికీ సపోర్టుగా ఉన్నారు. మా తమ్ముడు మా అమ్మని తీసుకుని వెళ్తానంటే వద్దు అని అన్నారు.. ఎక్కువగా మేము బాగా చూసుకుంటామని మా అమ్మకి సపోర్ట్ గా ఉన్నారు అని అవని భర్త పై ప్రశంసలు కురిపిస్తుంది. నేనేం చేయలేదు నువ్వు మా వాళ్లకోసం చేస్తున్న దానితో పోలిస్తే ఇది చాలా తక్కువ నువ్వు గొప్పగా తీసేయకు అని అక్షయ్ అంటాడు.. వీరిద్దరూ కలిసి చాలా సంతోషంగా ఉంటారు.
మీనాక్షి ఏం చేస్తుందని అవని చూసేసి వస్తుంది.. కమల్ గదిలోకి వచ్చి పల్లవికి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తాడు.. నువ్వు మా వదినని అవమానించేలా మాట్లాడావ్ అందుకు నీకు కచ్చితంగా పనిష్మెంట్ ఇవ్వాలి నేను గదిలో పడుకుంటాను నువ్వు బయట పడుకో అనేసి అంటాడు.. ఏంటి బావా నువ్వు? మీ వదినకి ఏమైతది దానికి నాకు పనిష్మెంట్ ఇస్తూ ఉంటావు నేను బయట పడుకోను గదిలోనే పడుకుంటాను అని అంటుంది.. ఇక పడుకోవాలంటే నీకు కొన్ని కండిషన్లు ఉన్నాయి…
ఏంటి బావా అది అని పల్లవి అడుగుతుంది. నువ్వు కళ్ళు మూసుకోకుండా కళ్ళు తెరుసుకొని నిద్రపోవాలి ఇదే నీకు ఇవ్వాలి ఇచ్చే పనిష్మెంట్ అని కమల్ అంటాడు.. కమలు పల్లవికి రాత్రంతా నిద్రపోనివ్వకుండా చుక్కలు చూపిస్తూ ఉంటాడు… పల్లవి ఈ తింగరోడు దగ్గర ఇరుక్కున్నాను ఏంటి అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక కమల్ ఇంకొకసారి ఇలా చేసావంటే కచ్చితంగా నీకు ఇంకాస్త ఎక్కువగా పనిష్మెంట్ ఇస్తాను అది గుర్తుపెట్టుకో అనేసి రాత్రంతా పల్లవికి నిద్రపోనివ్వకుండా చుక్కలు చూపిస్తాడు.
ఇక అవని అక్షయ్ ఇద్దరు కూడా ప్రేమగా దగ్గరవుతూ ఉంటారు.. వీరిద్దరూ చాలా సంతోషంగా ఉంటారు.. ఇక ఆరాధ్య రావడంతో అక్షయ్ తన ఆశల్ని పక్కన పెట్టేసుకుంటాడు. పల్లవి మాత్రం నన్ను కొట్టిన మీనాక్షికి ఏదో ఒకటి చేయాలి. మా అమ్మ నాన్నల్ని తీసుకొని వచ్చి బుద్ధి చెప్పించాలి. లేదా ఇంట్లోంచి బయటికి వెళ్లిపోయేలా చేయాలి అని అనుకుంటుంది.. పల్లవి ఈ విషయాన్ని చక్రధర్తో చెప్పేస్తుంది.. రాజేశ్వరి మన అమ్మాయికి ఇంత అవమానం జరిగితే అసలు ఊరుకునేది లేదు అక్కడికి వెళ్లి మనం ఏంటో తేల్చుకోవాలి అని అంటుంది. అందరూ కలిసి అక్కడికి వెళ్లి ఆవిడని ఇంట్లోంచి బయటికి పంపించాలి అని పల్లవి అంటుంది.
Also Read : మౌనిక ఎంట్రీ తో హ్యాపీ.. రోహిణికి షాక్.. బాలు కోసం మీనా వెయింటింగ్..
తర్వాత పల్లవి తన తల్లిదండ్రులు తీసుకొని తన ఇంటికి వెళ్తుంది.. పార్వతి మీనాక్షితో మీరేం తప్పు చేయలేదు వదిన గారు మీరేం బాధపడకండి అని అంటుంది.. పల్లవి చక్రధర్ రావడం చూసి మీనాక్షి షాక్ అవుతుంది.. మా కూతురుని అక్కడే కొడితే నీకు తెలిసేది కాదు అందుకే ఇక్కడికి వచ్చి పడుతున్నానని పల్లవి చంప పగలగొడుతుంది రాజేశ్వరి. పల్లవి మాత్రం ఏం జరుగుతుందో అర్థం కాక షాక్ లో ఉంటుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.. రేపటి ఏపిసోడ్ లో జరుగుతుందో చూడాలి…