Rashmika Mandanna: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న విషయం తెల్సిందే.
టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అని తేడా లేకుండా అన్ని భాషల్లో కూడా హిట్స్ అందుకొని టాప్ రేస్ లో కొనసాగుతుంది.
ఇక ఈ ఏడాది రష్మిక పుష్ప 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని అందుకుంది. శ్రీవల్లీగా ఆమెకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంది.
రష్మిక చేతిలో ప్రస్తుతం నాలుగైదు సినిమాలు ఉన్నాయి. సినిమాలు అన్ని ఒక ఎత్తు అయితే.. సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత మరో ఎత్తు.
సోషల్ మీడియాలో నిత్యం హాట్ హాట్ ఫొటోస్ ను షేర్ చేస్తూ కుర్రకారుకు కునుకు లేకుండా చేస్తోంది.
తాజాగా రష్మిక కాస్మోపాలిటన్ మ్యాగజైన్ పై హొయలు పోతూ కనిపించింది. ఆ ఫోటోలను ఆమె అభిమానులతో షేర్ చేసుకుంది.
మునుపెన్నడూ లేని విధంగా రష్మిక చాలా హాట్ గా కనిపించింది. పులిచారల కోట్ లో మరింత అందంగా కనిపించింది.
ప్రస్తుతం రష్మిక కవర్ పేజీ ఫొటోస్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కాస్మోపాలిటన్ మ్యాగజైన్ పై అమ్మడి ఫొటోస్ ని ఫ్యాన్స్ వైరల్ చేస్తున్నారు.
కవర్ పేజీపై నేషనల్ క్రష్.. ఏముందిరా బాబు అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు.