Dharmendra Death: బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(Dharmendra) ఇకలేరు. దాదాపు ఆరు దశాబ్దాల పాటు ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా ఓ వెలుగు వెలిగిన ఈయన ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే వయసు పైబడిన నేపథ్యంలో వృద్ధాప్య సమస్యల కారణంగా ధర్మేంద్ర తన 89 వ ఏటా మరణించారు. గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్లో(Breach Candy Hospital) చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజు రోజుకు తన ఆరోగ్య పరిస్థితి విషమించిన నేపథ్యంలో వైద్యులు తనని వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందించారు. ఇలా వెంటిలేటర్ పై చికిత్స తీసుకుంటున్నప్పటికీ ఆయన ఆరోగ్య పరిస్థితి పూర్తిగా విషమించిన నేపథ్యంలో కన్నుమూశారని తెలుస్తోంది. ఇలా ధర్మేంద్ర మరణ వార్త తెలియడంతో బాలీవుడ్ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ఇక ఈయన మరణం పై సినీ సెలబ్రిటీలు అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తూ నివాళులు అర్పిస్తున్నారు.