Road Accident in Krishna: అతివేగం ప్రమాదకరం.. పదే పదే పోలీసులు చెబుతున్నా యువకులు ఏ మాత్రం పట్టించుకోలేదు. ఫలితంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు జోరందుకున్నాయి. తాజాగా కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులోని ముగ్గురు యువకులు స్పాట్‌లో మృతి చెందారు.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాాదం
కృష్ణా జిల్లా ఉయ్యూరు సమీపంలో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పింది. జాతీయరహదారి పైనుంచి సర్వీసు రోడ్డులోకి మూడు పల్టీలు బోల్తా పడింది. ఈ ఘటనలో విజయవాడలోని కుందేరు ప్రాంతానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సమీపంలోని వ్యక్తులు వెంటనే పోలీసులు, అంబులెన్స్ కు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి రాగానే గాయపడిన బాధితుడ్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతడికి చికిత్స అందిస్తున్నారు. అతి వేగం ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.
జాతీయ రహదారిపై మూడు పల్టీలు కొట్టిన కారు
మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉయ్యూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన నేపథ్యంలో జాతీయ, సర్వీసు రోడ్డుపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. డ్యామేజ్ అయిన వాహనాన్ని పక్కకు తొలగించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.
ALSO READ: వృద్ధురాలిపై యువకుడు అత్యాచారం.. అన్నమయ్య జిల్లాలో దారుణం
మృతులు కుందేరు ప్రాంతానికి చింతయ్య, రాకేశ్ బాబు,ప్రిన్స్‌గా గుర్తించారు. వారంతా 17 నుంచి 24 ఏళ్ల వయస్సు లోపు వారు. దీంతో యువకుల ప్రాంతంలో విషాదచాయలు అలముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సివుంది.