BigTV English
Advertisement

Shiva Re release: అప్పట్లోనే అన్ని కోట్ల కలెక్షన్స్.. సృష్టించిన రికార్డ్స్ ఇవే!

Shiva Re release: అప్పట్లోనే అన్ని కోట్ల కలెక్షన్స్.. సృష్టించిన రికార్డ్స్ ఇవే!

Shiva Re release: ప్రముఖ సినీ నిర్మాత అన్నపూర్ణ స్టూడియోస్.. ఎస్ క్రియేషన్స్ బ్యానర్ పై యార్లగడ్డ సురేంద్ర, అక్కినేని వెంకట్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం శివ (Shiva). నూతన నటీనటులు దర్శకులతో తెరకెక్కిన ఈ సినిమా 1989 అక్టోబర్ 5న రిలీజ్ అయ్యి ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. ముఖ్యంగా ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma) దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిన ఈ చిత్రంలో నాగార్జున (Nagarjuna ), అమల(Amala )జంటగా నటించగా.. రఘువరన్, మురళీమోహన్, జెడీ చక్రవర్తి, శుభలేఖ సుధాకర్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, రామ్ జగన్ , నిర్మలమ్మ, గొల్లపూడి మారుతీ రావు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇళయరాజా అందించిన మ్యూజిక్.. ఎస్.గోపాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ.. తనికెళ్ల భరణి మాటలు సినిమాకు మరింత విజయాన్ని అందించాయి. 36 ఏళ్ల తర్వాత మళ్లీ లేటెస్ట్ టెక్నాలజీతో 4K వెర్షన్, డాల్బీ అట్మాస్ తో ఈ సినిమా నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.


అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రం..

నిజానికి ఈ సినిమా కొత్త నటీనటులతో రిలీజ్ చేయడంతో ఈ చిత్రానికి బిజినెస్ పెద్దగా జరగలేదు. దాంతో ఈ చిత్ర నిర్మాతలే నైజాం ఏరియాలో సొంతంగా విడుదల చేశారు. ఆంధ్రలో కృష్ణ ,గుంటూరు జిల్లాలలో బిజినెస్ ఒక మోస్తారుగా జరిగింది. విశాఖపట్నం, ఈస్ట్ ,వెస్ట్, గోదావరి జిల్లాలలో నిర్మాతలే స్వయంగా విడుదల చేశారు. మొదటి టాక్ పాజిటివ్ తెచ్చుకోవడంతో థియేటర్లకు బారులు తీరారు ప్రేక్షకులు. అలా ఆంధ్ర, తెలంగాణలో కలిపి 22 సెంటర్లలో వంద రోజులు.. 5 సెంటర్లలో 175 రోజులు ఆడి సంచలనం సృష్టించింది ఈ సినిమా. ముఖ్యంగా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి 1989లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది.

also read:Bigg Boss 9: ఈవారం నామినేషన్స్ లోకి వచ్చింది ఎవరంటే?


కొత్త నటీనటులతో సరికొత్త రికార్డు..

అప్పట్లోనే నైజాం ఏరియాలో కోటి రూపాయలు రాబట్టిన ఈ సినిమా.. ఆంధ్రాలో 3 కోట్లు రాబట్టింది. అలా మొత్తంగా రెండు తెలుగు రాష్ట్రాలలో 4 కోట్లు వసూలు చేసింది.. తెలుగులోనే కాదు.. తమిళంలో ఉదయం పేరిట ఈ చిత్రాన్ని రిలీజ్ చేయగా 10 సెంటర్లలో 100 రోజులు.. 5 సెంటర్లలో సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ జరుపుకుంది. అలా తమిళ్, హిందీ, తెలుగు భాషల్లో ఈ సినిమా 1990లో మొత్తం 10 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వసూలు చేసి రికార్డు సృష్టించింది. మొత్తానికి కొత్త నటీనటులతో వచ్చిన ఈ సినిమా ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే నవంబర్ 14న రీ రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

జోరుగా ప్రమోషన్స్..

విడుదల తేదీకి కేవలం మూడు రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా చేపట్టారు చిత్ర బృందం. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) కూడా ఈ సినిమా రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నట్లు చిన్న బిట్ రిలీజ్ చేశారు. అటు అమల, నాగార్జున ఇద్దరూ కూడా బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసి సినిమాను ప్రమోట్ చేసుకున్నారు.

Related News

Hero Dharmendra: భార్య ఉండగానే.. మతం మారి రెండో పెళ్లి.. ధర్మేంద్ర జీవితంలో అన్నీ ట్విస్ట్ లే

Dharmendra Death: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. నటుడు ధర్మేంద్ర మృతి.. విషాదంలో బాలీవుడ్!

MM Keeravani: కీరవాణి సక్సెస్ సీక్రెట్ చెప్పేసిన శృతిహాసన్.. అందుకే ఆస్కార్ గ్రహీత అంటూ!

Sigma : సందీప్ కిషన్ తో విజయ కొడుకు చేయబోయే సినిమా కథ ఇదే

SS Rajamouli : గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కి నో కెమెరాస్, తమిళ్ ఇండస్ట్రీని ఫాలో అవుతున్నారా?

50 Years Of Mohan Babu : మోహన్ బాబుకు గ్రాండ్ ఈవెంట్, ఈసారి ఏ వైరల్ స్పీచ్ ఇస్తారో?

Ravi Babu : చివరిసారిగా అతని కాళ్ళను తాకాను, రామానాయుడు గొప్పతనం ఇదే

Big Stories

×