Illu Illalu Pillalu Today Episode November 11th: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రేమ ఎంతగా ధీరజ్ మౌనంగా ఉండాలని చూసినా కూడా రెచ్చగొడుతుంది. నువ్వు ఏమైనా అంటే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను మల్ల తిరిగి రాను అని ప్రేమ దీరజ్ అంటుంది.. వీళ్ళిద్దరూ గొడవ పడటం భాగ్యం ఆనందరావు చూస్తారు. వీళ్ళ గొడవ ఎంతవరకు వెళుతుందో చూడాలని మౌనంగా ఉంటారు. ప్రేమ నన్ను అంటే నేను ఊరుకోను మా పుట్టింటికి వెళ్ళిపోతానని కోపంగా వెళ్ళిపోతుంది. ఇది నిజంగానే వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోతుందేమో అని ధీరజ్ పరిగెత్తుకుంటూ బయటికి వెళ్తారు. కానీ ప్రేమ నిజంగానే వాళ్ళ పుట్టింటి లోపలికి వెళ్ళిపోతుంది.. ధీరజ్ కూడా వెనకాలే వెళ్ళిపోతాడు. కానీ ప్రేమ మాత్రం లోపలికి వెళ్లిపోవడంతో ధీరజ్ ఇది అక్కడికి వెళ్లి పోయిందంటే ఏం గొడవలు జరుగుతాయో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ప్రేమ మళ్లీ తిరిగి ఇంటికి రావడంతో భాగ్యం షాక్ అవుతుంది. నర్మద అరెస్ట్ అవుతుందని సేన, భద్ర ఇద్దరు సంతోష పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం ఆనందరావు ఇద్దరు రామరాజు ఇంటికి వస్తే తొందరగా నాలుగైదు లక్షలు లాగేసి మనం వెళ్ళిపోవచ్చు అని అనుకుంటారు. కానీ మనం ఇంట్లోనే సెటిల్ అయితే చాలా సంతోషంగా ఉంటుంది కదా అని ఆనందరావు ప్లాన్ చేస్తాడు.. నర్మదా నిర్దోషి అని తెలుసుకొని ఇంట్లోని వాళ్ళందరూ చూశారా నర్మదక్క ఏ తప్పు చేయదు అని సంతోష్ పడుతుంటారు. ఎప్పుడు ఏది తప్పు చేయదు. నర్మదా నా కోడలు అని వేదవతి సంతోషంగా అందరితో చెప్తుంది.. ఇక ప్రేమ మా అక్కని తప్పు అన్న వాళ్ళు నోరులు ముగించేలా చేసింది చెప్పుతో కొట్టినట్లు చేసింది అని సంతోష పడుతూ ఉంటుంది.
ప్రేమ మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. ఇక తర్వాత శ్రీవల్లి మాత్రం మౌనంగా ఉంటుంది. అందరూ సంతోషంగా ఉంటే శ్రీవల్లి మౌనంగా ఉండడం చూసి భాగ్యం ఆనందరావు ఇద్దరు కూడా దీనికి ఏదో అయిందని అనుకుంటారు. లోపలికి వచ్చి ఏంటే అలా ఉండి పోయావు అని గిల్లీ శ్రీవల్లిని స్పృహలోకి తీసుకొని వస్తారు.. ఆ నర్మదా పని అయిపోయింది అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత నేనే ఈ ఇంటికి మహారాణినని చాలా సంతోషపడ్డాను. నా ఆశ అప్పుడే ఆవిరి అయిపోయింది అని శ్రీవల్లి టెన్షన్ పడుతూ ఉంటుంది..
ఇక సేనపతి ఇంటికి పోలీసులు రావడం చూసి భాగ్యం ఏంటి వీళ్ళు ఇంటికి పోలీసులు వస్తున్నారు అని అనుకుంటుంది.. వదిన గారు వాళ్ళింటికి పోలీసులు వెళ్తున్నారండి అని చెప్పగానే అందరూ అక్కడికి పరిగెత్తుకుంటూ వెళ్తారు. మా ఇంటికి పోలీసులు వచ్చారు ఏంటి అని సేన ఆశ్చర్యంతో అడుగుతాడు. మీరు మాకు కోపరేట్ చేసే మాకు బయటకు రావాలి లేదంటే మిమ్మల్ని ఇక్కడే అరెస్ట్ చేసుకొని బలవంతంగా తీసుకెళ్లాల్సి వస్తుందని పోలీసులు అంటారు.
పోలీసులు సేనపతిని బలవంతంగా బయటికి తీసుకురావడం చూసిన వాళ్లందరూ షాక్ అవుతారు. అప్పుడే ఆటో నుంచి బయటికి వచ్చిన నర్మదా నన్ను అడ్డంగా ఇరికించాలని అనుకున్నారు కానీ మీరే ఇరుక్కున్నారు అది మీకు అర్థం కావట్లేదు అని అంటారు.. అన్యాయంగా గవర్నమెంట్ స్థలంలో మీరు అపార్ట్మెంట్లు కట్టారు. అది తప్పు అని ప్రశ్నిస్తే నన్ను లంచం తీసుకున్నవని ఇరికించేసారు. నీకే అని తెలివితేటలుంటే కష్టపడి గవర్నమెంట్ జాబ్ ఉద్యోగం తెచ్చుకుని ఈ పొజిషన్లో ఉన్న నాకు ఎన్ని తెలివితేటలు ఉంటాయని నర్మదా అంటుంది..
Also Read : అక్షయ్ కు అవని థ్యాంక్స్.. పల్లవి పై కమల్ రివేంజ్.. చక్రధర్ కు దిమ్మతిరిగే షాక్..
అప్పుడే అక్కడికి వచ్చిన రామరాజుకు వేదవతి జరిగిన విషయాన్ని చెప్తుంది.. నా కోడలు ఇది తప్పు అని నువ్వు అన్నావు.. ఇప్పుడు నా కోడలిది తప్పు అని చూపించాలనుకున్న నీకు సరే నువ్వు బుద్ధి చెప్పాడు ఆ దేవుడు అని రామరాజు అంటాడు. నీకు తగిన శాస్తి జరిగిందని రామరాజు సేనకి ఇకమీదటైనా బుద్ధిగా ఉండు లేదంటే మాత్రం ఇలాంటివి ఇంకా చూస్తావు అని వార్నింగ్ ఇస్తాడు.. అసలు ఇదంతా ఎలా జరిగిందో తెలుసా అని ప్రేమ వివరిస్తుంది.. తండ్రికి మంచి బహుమతి ఇచ్చావు.. నువ్వు చాలా సంతోషంగా ఉండాలి అమ్మ నా కూతురు అని అనిపించుకున్నావులే అని ప్రేమను తిడతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…