BigTV English

Bigg Boss Nikhil: ఎట్టకేలకు నిఖిల్- కావ్య కలిశారు..

Bigg Boss Nikhil: ఎట్టకేలకు నిఖిల్- కావ్య కలిశారు..

Bigg Boss Nikhil: బిగ్ బాస్ సీజన్  8 ముగిసింది. అన్ని సీజన్స్  కన్నా ఈ సీజన్ కొద్దిగా డిఫరెంట్ గా ఉన్న విషయం  తెల్సిందే.  ఈ సీజన్ లో  కొత్తవారు- పాతవారు కలిసి  గేమ్ నాటారు. ఇక మొదటి నుంచి  ఈ సీజన్ విన్నర్ నిఖిల్ అని  చెప్పుకుంటూ వచ్చారు. అందరు చెప్పినట్లుగానే నిఖిల్ నే విన్నర్ అయ్యాడు. ఇక హౌస్ లో ఉన్నన్ని రోజులు తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొస్తూనే ఉన్నాడు. తన కోస్టార్ కావ్యతో ప్రేమలో ఉన్నట్లు చెప్పకనే చెప్పుకొచ్చాడు.


“ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు తనే నా భార్య అని తెలిసిపోయింది. నా అన్ని బ్రేకప్‌లను ఆమె మర్చిపోయేలా చేసింది. మా ప్రేమకు ఆరేళ్లు. మేము విడిపోయామా? అంటే నేనైతే ఆ ఎమోషనల్‌ బంధం నుంచి బయటకు రాలేదు. ఫ్యూచర్ లో కూడా తనే నా భార్య అని ఫిక్స్.. మా ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. నేను ఎన్నో మాటలు అన్నాను. తప్పుగా మాట్లాడాను. హౌస్ నుంచి బయటకు వెళ్ళాకా మొదటగా కప్ తీసుకొని ఆమె వద్దకే వెళ్తాను. ఒప్పుకోకపోతే కాళ్లు పట్టుకొని బతిమిలాడతాను. ఒప్పుకొనేవరకు ఎదురుచూస్తాను” అని చెప్పుకొచ్చాడు.

NTR: అభిమాని కోసం రూ. 12 లక్షల బిల్ కట్టిన ఎన్టీఆర్.. కౌశిక్ డిశ్చార్జ్


నిఖిల్- కావ్యకు  బుల్లితెర ప్రేక్షకుల్లో మంచి అభిమానం ఉంది. గోరింటాకు అనే సీరియల్ తో వీరు అందరి హృదయాలను గెలుచుకున్నారు. ఇక ఒక షోలో కావ్య వేరొకరితో  డ్యాన్స్  చేయకుండా నిఖిల్ చేసిన రచ్చ అంతాఇంతా కాదు. దీంతో వీరిద్దరూ కేవలం ఫ్రెండ్స్ మాత్రమే కాదు అని అందరికి తెల్సింది. ఆ ఇన్సిడెంట్ తరువాత .. వీరు కలిసి కనిపించలేదు. బిగ్ బాస్ కు వచ్చాకా   కావ్యతో బ్రేకప్ అయ్యిందని, ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడానికే బిగ్ బాస్ కు వచ్చినట్లు నిఖిల్ తెలిపాడు.

ఇక షో అయ్యింది. విన్నర్ గా నిఖిల్ గెలిచాడు. కానీ, హౌస్ నుంచి బయటకు వచ్చాకా మాత్రం నిఖిల్  మాట నిలబెట్టుకోలేకపోయాడు. కావ్య దగ్గరకు వెళ్తానని చెప్పాడు. ఇప్పటివరకు వెళ్లలేదని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ జంట ఒక షోలో కనిపించారు. శ్రీముఖీ యాంకర్ గా  వ్యవహరిస్తున్న ఆదివారం విత్ స్టార్ మా పరివారం ప్రోగ్రామ్ లో బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ ను గెస్ట్ గా పిలిచారు. బిగ్ బాస్ పరివారంతో సీరియల్ పరివారం పోటీపడనుంది.

Manisha Koirala: 11 మందితో ఎఫైర్స్.. పెళ్లి చేసుకున్నా రెండేళ్లే.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్ గురించి తెలుసా..?

సీరియల్ పరివారంలో కావ్య రాగా.. బిగ్ బాస్  విన్నర్ గా నిఖిల్ వచ్చాడు. అలా ఈ జంట ఒకే వేదికపై కనిపించి కనువిందు చేసింది. ఇక ఇక్కడ కూడా వీరు ఎడముఖం పెడముఖంగానే కనిపించారు. ముఖ్యంగా కావ్య..  నిఖిల్ ను సీరియస్ గా చూడడం ప్రోమోలో కనిపిస్తుంది. అంతేకాకుండా వీరిద్దరూ ఒకరినొకరు పలకరించుకోలేదు. దీంతో వీరి మధ్య ఇంకా వివాదం నడుస్తున్నట్లే అనిపిస్తుంది. మరి నిఖిల్.. కావ్యను ఒప్పించి పెళ్లి చేసుకుంటాడా .. ? లేదా.. ? అనేది తెలియాల్సి ఉంది.

Related News

Bigg Boss 9 Promo: హౌస్ లో మరో కొత్త లవ్ ట్రాక్.. ఒక్కొక్కరు ఇద్దరేసి!

Bigg Boss 9: గౌతమి ఎఫెక్ట్.. రీతూపై భారీ వేటు పడనుందా?

Bigg Boss 9 Telugu: రీతూకి డిమోన్ వెన్నుపోటు.. ల*త్కో*ర్ పనులంటూ.. శ్రీజ సేవ్, నామినేషన్ లో ఉన్నదేవరంటే..

Divvela Madhuri: నా రాజాను వదిలి ఉండలేను.. కానీ, వైల్డ్ కార్డ్ ఎంట్రీ పై మాధురి క్లారిటీ!

Bigg Boss 9 wildcard : వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ వీళ్లే.. ఇక హౌస్‌లో రచ్చ రచ్చే!

Bigg Boss 9 Promo: నామినేషన్స్‌లో రచ్చ రచ్చ.. కోడిగుడ్డుపై ఈకలు పీకుతా.. శ్రీజపై మాస్క్ మ్యాన్ ఫైర్

Bigg Boss 9: ఎన్టీఆర్ షోలో మర్యాద మనీష్.. గుండు సీక్రెట్ రివీల్ చేస్తూ!

Bigg Boss Telugu 9: సంజన సీక్రెట్ బయటపెట్టి షాకిచ్చిన మనీష్.. వరస్ట్ ప్లేయర్ శ్రీజ, ప్రియకు బిగ్ బాంబ్!

Big Stories

×