Kajal Aggarwal: హీరోయిన్ కాజల్ అగర్వాల్ మళ్లీ వార్తల్లోకి వచ్చేసింది.
ఏ తరహా న్యూస్ అనేది హార్డ్‌కోర్ అభిమానుల్లో ఆసక్తిగా మారింది.
రెండు దశాబ్దాల పాటు గ్లామర్ ఇండస్ట్రీని ఏలేసింది కాజల్.
బాలీవుడ్ ద్వారా ఎంట్రీ ఇచ్చినా, కెరీర్ అంతా టాలీవుడ్.. మహా అయితే కోలీవుడ్‌లో సాగింది.
వీలు చిక్కినప్పుడల్లా బాలీవుడ్‌లో సిన్మాలు చేస్తోంది.
ఓ వైపు సినిమాలు చేస్తూనే మరోవైపు రెండు మూడు వ్యాపారాలు చేస్తోంది.
మ్యారేజ్ తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టేసింది. అసలు విషయానికొద్దాం.
మరోసారి కాజల్ తల్లి కాబోతోందంటూ ఓ వార్త ప్రచారం సాగుతోంది.
ఇందులో నిజమెంతో తెలీదుగానీ, విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ విషయం కాజల్ చెవిలో పడింది.
ఎలాంటి కామెంట్స్ చేయకుండా కేవలం ఓ ఫోటోషూట్ సరిపెట్టేసింది కాజల్. గాసిప్స్‌పై మీరే ఓ అంచనాలకు రావాలంటూ ఫోటోషూట్‌ని బయటపెట్టింది.