BigTV English

BIG Shock To KCR: కేసీఆర్‌కు ‘పవర్’ షాక్..? త్వరలో అరెస్ట్..!

BIG Shock To KCR: కేసీఆర్‌కు ‘పవర్’ షాక్..? త్వరలో అరెస్ట్..!

ఇక విద్యుత్ ఒప్పందాలతో పాటు.. ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన తప్పిదాలపై.. జస్టిస్‌ మదన్‌ కమిషన్‌ రెడీ చేసిన నివేదికను.. ప్రస్తుతం కొనసాగుతున్నఅసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలని కేబినెట్ తీర్మానించింది. నివేదికపై సభలో విస్తృతంగా చర్చించిన తర్వాత.. మాజీ సీఎం కేసీఆర్‌పై తీసుకునే చర్యలకు సంబంధించి.. అసెంబ్లీ సాక్షిగానే ప్రకటన చేయనుంది ప్రభుత్వం. దీని ఆధారంగా కేసీఆర్‌ సహా పలువురిపై కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు కూడా అధికార వర్గాలు తెలిపాయి. నిన్న జరిగిన కేబినెట్ మీట్‌లో ప్రధానంగా విద్యుత్తు కమిషన్‌ నివేదికపైనే సుదీర్ఘంగా చర్చ జరిగింది.

గత పదేళ్ల కాలంలో కేసీఆర్‌ డిస్కమ్‌లను ఆర్థికంగా కుప్ప కూల్చారని, ఆయన మెప్పు కోసం విద్యుత్తు సంస్థలు మునుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని కమిషన్ తేల్చింది. విద్యుత్తు కొనుగోళ్లు, పవర్‌ ప్లాంట్ల నిర్మాణంలో తీసుకున్న నిర్ణయాలతో.. రానున్న 25 ఏళ్లపాటు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని కమిషన్ అభిప్రాయ పడింది. కాలం చెల్లిన టెక్నాలజీతో కట్టిన భద్రాద్రి పవర్‌ ప్లాంట్‌ కారణంగా… రానున్న 25 ఏళ్లలో 9వేల కోట్ల దాకా ప్రజలపై భారం పడనుందని అభిప్రాయపడింది.


Also Read: కేసీఆర్ చేసిన అప్పులు ఇవే.. ఆర్బీఐ రిపోర్ట్‌లో ఏముంది..?

సూపర్‌ క్రిటికల్‌తో పోల్చుకుంటే సబ్‌ క్రిటికల్‌లో ప్లాంట్‌ ఆక్సిలరీ కన్జంప్షన్‌, హీట్‌ రేట్‌, మెయింటినెన్స్‌ తదితర ఖర్చులు ఏటా 350 కోట్ల వరకూ అదనంగా పడతాయని, ప్లాంటు జీవిత కాలం 25 ఏళ్లకు దాదాపు 9వేల కోట్ల వరకూ అదనపు భారం పడుతుందని క్యాబినెట్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక, ఛత్తీ‌స్‌గఢ్‌తో చేసుకున్న విద్యుత్తు కొనుగోలు ఒప్పందంతో.. కూడా 3వేల 642 కోట్ల నష్టం జరిగిందని నివేదిక తేల్చింది. ఒక యూనిట్ విద్యుత్‌ను తొలుత మూడు రూపాయల అరవై పైసలకే కొన్న ప్రభుత్వం.. ఆ తర్వాత ఇంధన సర్దుబాటు పేరిట ఏడు రూపాయలకు కొనడాన్ని కేబినెట్ తప్పుబట్టింది.

ఇక వెయ్యి మెగావాట్ల కరెంట్‌ను తీసుకోవడానికి ఛత్తీసగఢ్‌తో ఒప్పందం చేసుకున్నా.. దానికి తగినట్టుగా ఆ రాష్ట్రం కరెంట్‌ ఇవ్వలేదని కమిషన్ తేల్చింది. దాంతో ఓపెన్‌ యాక్సె్‌సలో కొనుగోలు చేయాల్సి వచ్చిందని.. ఫలితంగా 2వేల కోట్ల అదనపు భారం తెలంగాణపై పడిందని కమిషన్ రిపోర్ట్ ఇచ్చించి ప్రభుత్వానికి.

Related News

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Mallareddy: మల్లారెడ్డి యూటర్న్.. రాజకీయాల్లో నో రిటైర్మెంట్

Telangana rains: మళ్ళీ ముంచెత్తనున్న వర్షాలు.. ఆగస్టు 14 నుండి 17 వరకు జాగ్రత్త!

Big Stories

×