Karthika Masam 2025: హిందూ మతంలో కార్తీక మాసానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ నెల అత్యంత పవిత్రమైనదిగా చెబుతారు. నాలుగు నెలల యోగ నిద్ర తర్వాత.. విష్ణువు ఈ నెలలో మేల్కొంటాడని మత విశ్వాసాలు చెబుతున్నాయి. కార్తీక మాసంలో భజనలు, కీర్తనలు, స్నానం, దానాలు, గంగా పూజ, దీపాలు వెలిగించడం, తులసి పూజకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం.. ఈ నెలలో దీపాలు వెలిగించడం, తులసి పూజ చేయడం శాశ్వతమైన పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, తులసి పూజ చేయడం వల్ల జీవితానికి ఆనందం, శ్రేయస్సు, శాంతి లభిస్తాయి. కార్తీక మాసం యొక్క ప్రాముఖ్యత, ఇంతకీ ఈ నెల ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
కార్తీక మాసం 2025 తేదీలు:
వేద క్యాలెండర్ ప్రకారం.. ఈ సంవత్సరం కార్తీక మాసం అక్టోబర్ 8న ప్రారంభమై నవంబర్ 5 వరకు కొనసాగుతుంది. కార్తీక మాసంలో విష్ణువు, శ్రీకృష్ణుడు, తులసి మాతను ప్రత్యేకంగా పూజిస్తారు. ఈ నెలలో దీపాలు సమర్పించడం వల్ల మోక్షం లభిస్తుందని నమ్ముతారు.
కార్తీక మాసం మతపరమైన ప్రాముఖ్యత ఏమిటి ?
హిందూ మతంలో.. కార్తీక మాసం అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. కార్వా చౌత్, దీపావళి, ధంతేరస్, గోవర్ధన పూజ, అనేక ప్రధాన ఉపవాసాలు, పండుగలు ఈ నెలలోనే వస్తాయి. కార్తీక మాసంలో సూర్యోదయానికి ముందు మేల్కొనడం, గంగా నదిలో స్నానం చేయడం, కీర్తనలు పాడటం, శ్లోకాలు పాడటం, పవిత్ర మందిరాలను సందర్శించడం చాలా పవిత్రమైందిగా చెబుతారు. ఇంకా.. ఈ నెలలో తులసిని పూజించడం ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. మత విశ్వాసాల ప్రకారం.. ఈ నెలలో పూజ, పారాయణం, ధ్యానం చేయడం వల్ల ఒక వ్యక్తికి అనేక రకాల శాశ్వతమైన పుణ్యాలు లభిస్తాయి.
కార్తీక మాసంలో దీపాలు వెలిగించడం, తులసిని పూజించడం మంచిది. అంతే కాకుండా ఉదయం, సాయంత్రం తులసిని పూజించడం చాలా ముఖ్యం. తులసి మొక్క దగ్గర స్వచ్ఛమైన నెయ్యితో దీపం వెలిగిస్తారు. కార్తీక మాసంలో తులసిని పూజించడం వల్ల కుటుంబంలో ఆనందం, శ్రేయస్సు, శాంతి కలుగుతాయి. ఇంకా.. ఈ నెలలో దీపాలు వెలిగించడం వల్ల విష్ణువు ,లక్ష్మీదేవి ఎంతో సంతోషిస్తారని అంటారు.