Extramarital Affair: ఏపీలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అల్లుడితో వివాహేతర సంబంధం పెట్టుకున్న అత్త.. అతడితో పెళ్లికి రెడీ అయింది. ఈ విషయం కూతురికి తెలిసి పెళ్లిని అడ్డుకోవడంతో.. కూతురిపై దాడి చేసింది. తిరుపతి జిల్లా కేవీబీపురం మండలంలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
అల్లుడిని పెళ్లి చేసుకునేందుకు అడ్డు చెప్పిందని సొంత కుమార్తె పై మహిళ హత్యాయత్నం చేసింది. కేవీబీపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలుడు (18), బాలిక (15) ఇటీవల ప్రేమ పెళ్లి చేసుకున్నారు. భర్త మరణించడంతో బాలిక తల్లి (40) వీరితో కలిసి ఉంటుంది. ఈ నేపథ్యంలో అల్లుడితో అత్త కొన్నాళ్లుగా వివాహేతర సంబంధం పెట్టుకుంది. శుక్రవారం రాత్రి వారి ఇంట్లోనే బాలిక పక్కనే ఉండగా అత్త, అల్లుడు పెళ్లి చేసుకోబోయారు.
తల్లి మెడలో తాళి కడుతున్న భర్తను బాలిక అడ్డుకుంది. దీంతో అమ్మ, కూతురి మధ్య గొడవ జరిగింది. కోపంతో ఊగిపోయిన బాలిక తల్లి, భర్త.. బాధితురాలిపై దాడి చేశారు. రోకలి బండతో కూతురి తలపై కొట్టడంతో ఆమె పెద్దగా కేకలు పెట్టింది. దీంతో స్థానికులు వచ్చి ఆమెను రక్షించారు. అత్త, అల్లుడి పెళ్లి విషయం తెలిసి స్థానికులు వారికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్ర గాయాల పాలైన బాలికను ఆసుపత్రికి తరలించారు. బాలిక ఫిర్యాదుతో భర్త, అమ్మపై పోలీసులు కేసు నమోదు చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో యువకుడి హత్య సంచలనం రేపింది. మాడుగుల సురేశ్(25) అనే యువకుడిని హత్య చేసి గోదావరిలో పడేశారు. ఈ కేసుకు సంబంధించి శనివారం ఆరుగురిని తణుకు పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. తాడేపల్లిగూడెం డీఎస్పీ విశ్వనాథ్ తణుకు పట్టణ పోలీస్ స్టేషన్‌లో మాట్లాడుతూ.. తన భార్య శిరీషతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కారణంతో సురేశ్‌ను హత్య చేసేందుకు తణుకుకు చెందిన లాయర్ సత్యనారాయణ రాజు కుట్ర చేశాడు.
సెప్టెంబర్ 23న శిరీష ఇంటి నుంచి బయటకు వచ్చిన సురేశ్‌ను సత్యనారాయణరాజు మరో నలుగురితో కలిసి కిడ్నాప్ చేశారు. సురేష్ ను హత్య చేసి గోనె సంచిలో మూట కట్టి కారులో చించినాడ తీసుకెళ్లారు. చించినాడ వంతెనపై నుంచి గోదావరిలో పడేశారు. సురేశ్ ఆచూకీ కోసం అతడి సోదరి గత నెల 25న తణుకు పోలీసులను ఆశ్రయించింది. లాయర్ సత్యనారాయణపై అనుమానం ఉందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది.
Also Read: Kadapa Crime News: కొడుకు రాసిన రక్తచరిత్ర.. తల్లిని కత్తితో గొంతుకోసి
ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు లాయర్, మరో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో సురేశ్ హత్య విషయం వెలుగులోకి వచ్చింది. సురేశ్ మృతదేహాన్ని ఇటీవల కోనసీమ జిల్లా రామేశ్వరం వద్ద గోదావరిలో లభ్యమైంది. దీంతో ఈ కేసులో ప్రధాన నిందితులు న్యాయవాది సత్యనారాయణ రాజుతో పాటు అతడి భార్య శిరీష, న్యాయవాది సహచరులను అరెస్టు చేసి రిమాండ్‌కు