BigTV English

Telangana BJP: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సెంట్రల్ వ్యూహం.. పదాధికారుల సమావేశంలో కీలక దిశానిర్ధేశం

Telangana BJP: లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ సెంట్రల్ వ్యూహం.. పదాధికారుల సమావేశంలో కీలక దిశానిర్ధేశం

Telangana BJP: హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో.. ఆదివారం జరిగిన పదాధికారుల సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. సుమారు రెండు గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో.. పార్టీకి చెందిన కీలక నాయకులు పాల్గొని, రాబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో పాటు లోకల్ బాడీ ఎన్నికల వ్యూహాలపై సమగ్ర చర్చ జరిపారు.


కీలక నేతల సమక్షంలో విస్తృత చర్చ

సమావేశానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ నేతల సూచనల మేరకు జిల్లా ఇన్‌చార్జీలు, మండల స్థాయి సమన్వయకర్తలు, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ.. ఈసారి పార్టీ గ్రామ స్థాయిలో బలపడేలా ప్రతి నేత కృషి చేయాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలు ప్రజల దాకా చేరితేనే బీజేపీ పట్ల నమ్మకం పెరుగుతుంది అని సూచించారు.


సమావేశంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, గ్రామ, మండల పరిషత్ ఎన్నికలు, అలాగే మున్సిపల్ ఎన్నికలు పై దిశానిర్దేశం జరిగింది.

కేంద్ర పథకాలను గ్రామాలకు తీసుకెళ్లే వ్యూహం

కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయడం. రైతు సమృద్ధి యోజన, ఆయుష్మాన్ భారత్, జల్ జీవన్ మిషన్, హౌసింగ్ స్కీమ్స్ వంటి పథకాలను బీజేపీ ప్రభుత్వం అందించిందని ప్రచారం బలంగా జరగాలి అన్నారు.

దీనికోసం ప్రతి గ్రామంలో బూత్ కమిటీలు, పంచాయతీ స్థాయి సమన్వయ బృందాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. గ్రామ పంచాయతీ స్థాయిలో మోడీ మిత్ర బృందాలు ఏర్పాటు చేసి, ప్రజలకు పథకాల వివరాలు, లబ్ధిదారుల ప్రయోజనాలు వివరించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

లోకల్ బాడీ ఎన్నికల్లో ప్రధాన అంశాలు

రాబోయే లోకల్ బాడీ ఎన్నికల్లో బీజేపీ అభివృద్ధి, పారదర్శకత, ప్రజాసేవ అనే మూడు ముఖ్య అంశాలపై పోటీ చేయాలి అని నిర్ణయించారు. స్థానిక ఎన్నికల్లో ప్రజల మద్దతు సాధించడానికి కేంద్ర నిధులతో జరుగుతున్న పనులు, స్కీమ్‌లు వివరించే ప్రత్యేక ప్రచార బృందాలను నియమించనున్నారు.

అలాగే, బీఆర్ఎస్, కాంగ్రెస్ పై కూడా వ్యూహాత్మకంగా విమర్శలు చేయాలని నిర్ణయించారు.

పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం

ప్రతి బూత్ స్థాయిలో సమన్వయం అవసరం. ప్రజలు కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి తెలుసుకోవాలి అని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం..

అదేవిధంగా, జిల్లా వారీగా బాధ్యతలు అప్పగించే జాబితా సిద్ధం చేయాలని, ప్రతి జిల్లా కార్యదర్శి తమ పరిధిలో పార్టీని బలోపేతం చేసే చర్యలు వెంటనే ప్రారంభించాలని సూచించారు.

 

Related News

KTR On RTC Charges: సామాన్య ప్రయాణికుల నడ్డి విరిచారు.. ఆర్టీసీ ఛార్జీల పంపుపై కేటీఆర్ విమర్శలు

Cough Syrup: ఆ దగ్గు మందు వాడొద్దు.. తెలంగాణ డీసీఏ ఆదేశాలు

Telangana Rains: తెలంగాణలో మళ్లీ మొదలైన వర్షాలు.. ఎన్ని రోజులంటే..

Konda Surekha Grandson: చిచ్చర పిడుగు.. ఔరా అనిపిస్తున్న మంత్రి కొండా సురేఖ మనవడు..

RTC Charges: ప్ర‌యాణికుల‌కు బిగ్ షాక్‌…బస్ చార్జీలు పెంపు

Telangana: 101 వంటకాలతో కొత్త అల్లుడికి విందు.. ఒక్కటి తగ్గినందుకు తులం బంగారం, భలే ఛాన్స్!

jagtial News: జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షుద్ర పూజలు.. విద్యార్థుల్లో భయం, టార్గెట్ ఎవరు?

Big Stories

×