Harshit Rana: ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య అక్టోబర్ 19వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీమిండియా జట్టును తాజాగా ప్రకటించింది భారత క్రికెట్ నియంత్రణ మండలి. ఈ మేరకు అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు. అయితే ఇందులో హర్షిత్ రాణాకు ( Harshit Rana) అవకాశం రావడం పై సోషల్ మీడియాలో దారుణంగా కామెంట్స్ వస్తున్నాయి. పెద్దగా రాణించని హర్షిత్ రాణాను ప్రతి ఫార్మాట్ లో ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారని అభిమానులు ఫైర్ అవుతున్నారు. మహమ్మద్ సిరాజ్ కంటే పెద్ద పోటుగాడా ? అంటూ నిలదీస్తున్నారు.
గౌతమ్ గంభీర్ టీమిండియా కోచ్ అయినప్పటి నుంచి హర్షిత్ రాణాకు అవకాశాలు ఎక్కువగా వస్తున్న సంగతి తెలిసిందే. గతంలో కేకేఆర్ కోచ్ గౌతమ్ గంభీర్ ఉన్నాడు. అదే సమయంలో హర్షిత్ రాణా కూడా కేకేఆర్ జట్టులో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికి కూడా హర్షిత్ రాణా కేకేఆర్ జట్టులోనే కొనసాగుతున్నాడు. ఈ నేపథ్యంలోనే అతనికి ఎక్కువగా అవకాశాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీమిండియా అభిమానులు. టెస్టులు, వన్డేలు అలాగే టీ20 లు జరిగితే ఖచ్చితంగా హర్షిత్ రాణా పేరు టీమిండియా స్వ్కాడ్ లో ఉంటుందని… మండిపడుతున్నారు. బోర్డర్ గవాస్కర్ టోపీ 2024, ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నమెంట్, మొన్న జరిగిన ఇంగ్లాండ్ టూర్ అలాగే ఆసియా కప్ 2025, ఇప్పుడు ఆస్ట్రేలియా టూర్ లో హర్షిత్ రాణా స్థానం దక్కించుకున్నాడు. ఇంతలా అవకాశం వస్తే అతడు వినియోగించుకున్నాడా ? అంటే ఆ గణాంకాలే లేవు. ఒక మ్యాచ్ లో అదరగొడితే మరో మ్యాచ్ లో అట్టర్ ప్లాప్ అవుతున్నాడు. తాజాగా ప్రకటించిన వన్డే అలాగే టీ20 ఫార్మాట్ లో కూడా…హర్షిత్ రాణాకు అవకాశం ఇచ్చారు.
మహమ్మద్ సిరాజ్ టీమిండియాలో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. అతన్ని కేవలం టెస్టు ప్లేయర్ గా బీసీసీఐ ట్రీట్ చేస్తోంది. కానీ అన్ని ఫార్మర్స్ లో ఆడగల సత్తా మహమ్మద్ సిరాజ్ కు ఉంది. ఇప్పటివరకు ఒక్క గాయం లేకుండా…. ప్రతి మ్యాచ్ లోను అవకాశం వస్తే ఆడాడు సిరాజ్. అదే సమయంలో వికెట్లు కూడా పడగొడుతున్నాడు. అవసరం వస్తే బ్యాటింగ్ కూడా చేస్తాడు. అలాంటి సిరాజ్ కంటే హర్షిత్ రాణాకు టీమిండియా సెలక్షన్ కమిటీ ఎక్కువగా అవకాశాలు ఇస్తోంది. సిరాజ్ లో వన్ పర్సెంట్ కూడా హర్షిత్ రాణా పర్ఫామెన్స్ చేయలేదు. కానీ టీమిండియాలో పాలిటిక్స్ కారణంగా హర్షిత్ రాణాకు అవకాశాలు వస్తున్నాయని అభిమానులు ఫైర్ అవుతున్నారు. గౌతమ్ గంభీర్ అలాగే అగార్కర్ లాంటి వాళ్లను తొలగించి టాలెంట్ ఉన్న ప్లేయర్లను సెలెక్ట్ చేసే కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Abhishek Sharma Sister Wedding: ఇండియా కోసం త్యాగం…వీడియో కాల్ లో సోదరి పెళ్లి చూసిన అభిషేక్ శర్మ
Harshit rana is currently all formats bowler for India over Mohammad Siraj, The downfall of indian cricket is unreal mann. pic.twitter.com/vR8mCSfmTI
— Kevin (@imkevin149) October 4, 2025
Apart from God, Harshit Rana is the only person who is present everywhere.#RohitSharma #ViratKohli #INDvsAUS pic.twitter.com/592VEVy7Bi
— IND Cricket & Memes (@INDCricketGuide) October 4, 2025
ODI world cup 2027 playing XI 😭🫠😂
1. Shubman Gill (c)
2.
3.
4.
5.
6.
7.
8.
9.
10.
11. Harshit Rana— Bemba Nation (@BembaNation) October 4, 2025