Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ప్రతి ఏడాది అలరిస్తూ మంచి టీఆర్పీ రేటింగ్ తో సక్సెస్ దిశగా అడుగులు వేస్తోంది బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే తెలుగులో 8 సీజన్లు పూర్తికాగా.. ఇప్పుడు తొమ్మిదవ సీజన్ 4వ వారం కూడా చివరి దశకు చేరుకుంది. ఈసారి 9వ సీజన్లోకి ఏకంగా 6 మంది కామనర్స్ హౌస్ లోకి అడుగుపెట్టారు. అలాగే 9మంది సెలబ్రిటీలు వచ్చారు. ఎలిమినేషన్స్ లో భాగంగా మొదటి వారం ప్రముఖ లేడీ కొరియోగ్రాఫర్ శ్రష్టి వర్మ (Shrasti Varma) ఎలిమినేట్ అయ్యింది. రెండవ వారం మర్యాద మనీష్(Maryada Manish) ఎలిమినేట్ కాగా.. మూడవ వారం ప్రియా శెట్టి (Priya Shetty) ఎలిమినేట్ అయ్యారు. నాలుగవ వారం హరిత హరీష్ పై వేటు పడింది. ఈరోజు ఎపిసోడ్ లో హోస్ట్ నాగార్జున (Nagarjuna) ఈ విషయాన్ని ప్రకటిస్తారు.
ఇదిలా ఉండగా వీకెండ్స్ వచ్చిందంటే చాలు హోస్ట్ నాగార్జున స్టేజ్ పైకి వచ్చి కంటెస్టెంట్స్ తో సందడి చేస్తారు.. వాళ్ళు చేసిన తప్పులను కడిగిపారేస్తూనే.. సరదాగా హౌస్ లో జరిగిన సన్నివేశాలను కూడా బయట పెడుతూ అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు . ఈ క్రమంలోనే ఈ వారం జరిగిన ఎపిసోడ్స్ లో జబర్దస్త్ ఇమ్మానుయేల్ (Emmanuel) తన నడుము ఎవరో గిల్లారని, అయితే ఎవరు గిల్లారో కూడా తనకు తెలుసునని, నాగార్జున గారు వచ్చినప్పుడు తన నడుము గిల్లింది వీడియో ఒకటి ప్లే చేసి చూపించమని అడుగుతాను అంటూ గోల చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయం వచ్చేసింది.. అందులో భాగంగానే తాజాగా విడుదల చేసిన ప్రోమోలో ఈ విషయాన్ని చూపించేశారు. విషయంలోకి వెళ్తే.. 28వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోని నిర్వాహకులు తాజాగా విడుదల చేశారు. సండే ఫన్ డే లో భాగంగా విడుదల చేసిన ఈ ప్రోమోలో.. హోస్ట్ నాగార్జున మాట్లాడుతూ..” గోల్డెన్ స్టార్ ఇమ్మానుయేల్ మీ నడుమ గిల్లింది ఎవరు?” అంటూ ప్రశ్నించారు. ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. “తన నడుము చాలా లావుగా వాచిపోయింది సార్” అంటూ అందరిని నవ్వించారు. పైగా గేమ్ అడ్డుపెట్టుకొని నా నడుము గిల్లారు సార్.. అని చెప్పగా.. అది ఎవరు ? అని నాగార్జున ప్రశ్నించారు.
ALSO READ:Raashii Khanna: టాలీవుడ్ -బాలీవుడ్ కి అదే తేడా.. పని గంటలపై రచ్చ లేపిందిగా?
ఇమ్మానుయేల్ మాట్లాడుతూ.. నాకు ఒకరి మీద డౌట్ ఉంది సార్ అంటూ అడగగా.. నాగార్జున ఎవరిమీ అని తిరిగి ప్రశ్నించారు. దీనికి ఇమ్మానుయేల్ తనూజ మీరు ఒప్పుకోండి అంటూ ఏమీ తెలియని అమాయకుడిలా అంటాడు. ఇక తనూజ సిగ్గు పడిపోతూ నేనే సార్ అంటూ నిజం ఒప్పుకుంది. అలాగే మళ్ళీ నాగార్జున మాట్లాడుతూ.. బ్రేక్ టైం లో నిన్ను బ్లూ పిల్లోతో కొట్టింది ఎవరు? అని ప్రశ్నించగా మళ్లీ తనుజ నేనే సార్ అంటూ తెలిపింది. ఇక ఇమ్మానుయెల్ మాట్లాడుతూ.. రోజుకు ఒక 30 , 40 సార్లు కొడుతుంది సార్. మాట్లాడినా.. మాట్లాడకపోయినా.. ఎందుకు మాట్లాడలేదు అని కూడా కొడుతుంది సార్ అంటూ హౌస్ లో నవ్వులు పూయించారు. మొత్తానికి అయితే ఈ ఇద్దరి సంభాషణకు సంబంధించిన ప్రోమో వైరల్ అవ్వడంతో బిగ్ బాస్ లవర్స్ తనూజ మహాముదురే.. మేము అనుకున్నంత అమాయకురాలేం కాదు అంటూ కామెంట్లు చేస్తున్నారు.