BigTV English

Kantara: Chapter 1: థియేటర్ లోకి పంజుర్లి దేవుడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

Kantara: Chapter 1: థియేటర్ లోకి పంజుర్లి దేవుడు.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న వీడియో!

Kantara: Chapter 1:కాంతార చాప్టర్ 1ని థియేటర్ లో చూసిన చాలామంది ప్రేక్షకులు సినిమా గూస్ బంప్స్ తెప్పిస్తోందని రివ్యూ ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా అక్టోబర్ 2న విడుదలైన కాంతార చాప్టర్ 1 సినిమా అద్భుతమైన హిట్ టాక్ తో థియేటర్లలో దూసుకుపోతుంది. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకి ప్రేక్షకుల్లో మంచి ఆదరణ లభిస్తోంది. 2022లో తెరకెక్కిన ‘కాంతార’ సినిమా అద్భుతమైన విజయం సాధించడంతో ఈ సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార చాప్టర్ 1 మూవీ ఉండబోతున్నట్టు అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమా తెరకెక్కబోతుంది అన్నప్పటినుండి ప్రేక్షకుల్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంది. అలా ఎట్టకేలకు ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలైంది.


థియేటర్లో ప్రత్యక్షమైన పంజుర్లీ దేవుడు..

అయితే తాజాగా కాంతార చాప్టర్ 1 మూవీకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట వైరల్ అవుతోంది. అదేంటంటే కాంతార చాప్టర్ 1 సినిమాని థియేటర్లో చూసే ప్రేక్షకులకి ఒక అద్భుతం కనిపించింది. అదేంటంటే..సినిమా చూస్తుండగానే థియేటర్లో పంజుర్లి దేవుడు ప్రత్యక్షమయ్యారు. ఇది చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంలో మునిగిపోయారు. ఒక విషయంలోకి వెళ్తే.. ఒక వ్యక్తి పంజుర్లి వేషధారణలో థియేటర్లలోకి వచ్చారు. అచ్చం పంజుర్లి దేవుడు ఆవహించినప్పుడు ఎలా అయితే ప్రవర్తిస్తారో.. అలాగే థియేటర్లోకి పరిగెత్తుకు వచ్చి నృత్యం చేస్తూ అక్కడున్న వారందరిని ఆశ్చర్యపరిచారు. దీంతో పంజుర్లి దేవుడి వేషాధరణలో ఉన్న ఆయన్ని ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి చాలామంది జనం ఆసక్తి కనబరిచారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రంలోని దిండిగల్ లో ఉండే ఓ థియేటర్ లో చోటు చేసుకుంది.

ALSO READ:Tollywood: పిక్ ఆఫ్ ది డే.. 80స్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. పైగా స్పెషల్ థీమ్!


వైరల్ గా మారిన వీడియో..

తెరమీద కాంతార చాప్టర్ 1 సినిమా చూస్తున్న ప్రేక్షకులకు కళ్ళ ముందు పంజుర్లి దేవుడు రూపం కనిపించడంతో ఒక్కసారిగా ఆశ్చర్యంలో మునిగిపోయారు. అంతేకాదు నిజంగా పంజుర్లి దేవుడు రూపంలో ఉన్న ఆయనను చూస్తున్నప్పుడు రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి అంటూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ క్యాప్షన్ జోడిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో తెగ చక్కర్లు కొట్టడంతో చాలామంది ఈ వీడియో చూసి అచ్చం పంజుర్లి దేవుడే వచ్చినట్టు ఉంది..చూడ్డానికి రెండు కళ్ళు చాలడం లేదు.. నిజంగా ఈ వీడియో చూస్తే గూస్ బంప్స్ వస్తున్నాయి అంటూ ఫైర్ ఎమోజీలను షేర్ చేస్తున్నారు.

కాంతార చాప్టర్ 1 మూవీ విశేషాలు..

కాంతార చాప్టర్ 1మూవీ విషయానికి వస్తే..రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడుగా చేసిన ఈ సినిమాలో రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) హీరోయిన్ గా చేసింది. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ లో విజయ్ కిరంగదూర్ నిర్మించిన ఈ సినిమా కన్నడలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలాగే ప్రస్తుతం ఈ సినిమా రూ.200 కోట్ల కలెక్షన్స్ కి చేరువలో ఉంది. కన్నడ భాషా పౌరాణిక యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన కాంతార చాప్టర్ 1 సినిమాకి కేవలం కన్నడిగులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ ఆకర్షితులవుతున్నారు. అలా ఈ సినిమా ద్వారా ఎంతోమందికి భూతకోల ఆచారం, పంజుర్లీ దేవుడి గురించి తెలియజేశారు రిషబ్ శెట్టి.

Related News

Raashii Khanna: టాలీవుడ్ -బాలీవుడ్ కి అదే తేడా.. పని గంటలపై రచ్చ లేపిందిగా?

khushboo:కరూర్ ఘటన పక్కా ప్లానింగ్.. అనుమానాలు రేకెత్తించిన ఖుష్బూ!

Tollywood: పిక్ ఆఫ్ ది డే.. 80స్ స్టార్స్ అంతా ఒకే ఫ్రేమ్ లో.. పైగా స్పెషల్ థీమ్!

Hero Suhas: సుహాస్ సినిమా షూటింగ్ సెట్లో ఘోర ప్రమాదం.. భారీగా నష్టం!

Rashmika -Vijay Deverakonda: ఇద్దరి ఆస్తుల విలువ ఎన్ని కోట్లో తెలుసా?

Sailesh kolanu: హిట్ డైరెక్టర్ నెక్స్ట్ మూవీ ఫిక్స్.. హీరో ఆయనే.. త్వరలో అనౌన్స్మెంట్!

Spirit: సందీప్ ప్లాన్ మామూలుగా లేదుగా.. ప్రభాస్ కి పోటీగా రంగంలోకి స్టార్ హీరో!

Big Stories

×