Delhi DSSSB TGT Posts: దిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలెక్షన్ బోర్డు (DSSSB) 5,346 ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (TGT) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన అభ్యర్థులు అక్టోబరు 9 నుంచి నవంబర్ 7వ తేదీ వరకు dsssb.delhi.gov.in వెబ్ సైట్ లో అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీష్, సామాజిక శాస్త్రం, పంజాబీ, సంస్కృతం, ఉర్దూ, గణితం విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
మొత్తం పోస్టులు- 5,346
పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో బీఏ, బీఎస్సీ, బీఈడీ, బీఈఐ, ఈడీ, ఈడీ(డ్రాయింగ్/పెయింటింగ్/ఫైన్ ఆర్ట్)లో ఉత్తీర్ణతతో పాటు CTET(సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్)లో అర్హత కలిగి ఉండాలి.
అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లు మించకూడదు. ప్రభుత్వ ఉద్యోగులకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది.
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ దిల్లీ పోలీస్ విభాగంలో 509 హెడ్‌కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. సెప్టెంబర్ 29 నుంచి ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం అయ్యాయి. అభ్యర్థులు అక్టోబర్ 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.100 కాగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఇచ్చారు.
గుర్తింపు పొందిన బోర్డు ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉండాలి.
పురుషులు 165 సెంటీమీటర్లు, మహిళలు 157 సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి. చెస్ట్ 78 నుంచి 82 సెంటిమీటర్లు ఉండాలి. 2025 జులై 1 నాటికి 18 నుంచి 25 ఏళ్లు వయస్సు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఇచ్చారు. ఎంపికైనా వారికి నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 జీతం వస్తుంది. రాత పరీక్ష, పీఎస్‌టీ, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ఉంటుంది.