Raashii Khanna: సౌత్ హీరోయిన్ రాశి ఖన్నా (Raashii Khanna) ప్రస్తుతం తన కొత్త సినిమా ప్రమోషన్స్ లో భాగంగా చాలా బిజీ బిజీగా గడిపేస్తోంది.ఈ నేపథ్యంలోనే టాలీవుడ్ ఇండస్ట్రీ, బాలీవుడ్ ఇండస్ట్రీ మధ్య ఉండే తేడాల గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది.. మరి ఈ హీరోయిన్ ఏం మాట్లాడింది? అనేది చూస్తే.. తాజాగా రాశి ఖన్నా ‘తెలుసు కదా’ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది.ఆ ఇంటర్వ్యూలో బాలీవుడ్, టాలీవుడ్ పరిశ్రమల మధ్య ఉండే తేడాల గురించి మాట్లాడుతూ.. తెలుగు సినిమా పరిశ్రమలో ఒకరోజు షూటింగ్లో కేవలం 9 గంటలే పని చేయాల్సి ఉంటుంది.
కానీ తమిళ, హిందీ పరిశ్రమల్లో అలా ఉండదు.తమిళ,హిందీ పరిశ్రమల్లో ఒకరోజు షూటింగ్ కి వెళ్తే కచ్చితంగా 12 గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్ల చాలా తొందరగా అలసిపోతాం. కానీ నాకు మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. అలాగే టాలీవుడ్,బాలీవుడ్ పరిశ్రమల వాతావరణం
లో చాలా తేడాలు ఉంటాయి. సౌత్ ఇండస్ట్రీలోని నటీనటులు చాలా ప్రైవేట్ గా ఉంటారు. తాము చేసే పనిలో లీనమైపోయి అంకితభావంతో పనిచేస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ లో ఉండే నటీనటులు మాత్రం ఎక్కువ ఆడంబరానికి పోతూ ఉంటారు. వాళ్లు సౌత్ ఇండస్ట్రీ నటీనటుల లాగా ప్రవర్తించరు.
అలాగే సౌత్ ఇండస్ట్రీలో ఉండే నటీనటులు ఇతర నటీనటుల పట్ల గౌరవం, విధేయత కలిగి ఉంటారు. సౌత్ ఇండస్ట్రీని చూసి బాలీవుడ్ ఇండస్ట్రీ నేర్చుకోవాలి అనే విధంగా మాట్లాడుతూ సౌత్ ఇండస్ట్రీ నార్త్ ఇండస్ట్రీ మధ్య ఉండే తేడాలను ఈ ఇంటర్వ్యూలో బయట పెట్టింది. అయితే రెండు పరిశ్రమలలోను కథలు చెప్పాలనే అభిరుచి ఉంటుంది.కానీ షూటింగ్ సెట్ లో ఉండే నటీనటుల ప్రవర్తనలో మాత్రం తేడాలు ఉంటాయి అని చాలా స్పష్టంగా రాశిఖన్నా చెప్పుకొచ్చింది.
రాశి ఖన్నా మాటలతో కొంతమంది బాలీవుడ్ అభిమానులు ఫైర్ అవుతున్నారు.. నీవు బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువ సినిమాలు చేయకపోయినంత మాత్రాన బాలీవుడ్ ఇండస్ట్రీని తక్కువ చేసి టాలీవుడ్ ఇండస్ట్రీని ఎక్కువ చేసి మాట్లాడడం తగదు. ఏ ఇండస్ట్రీ వారికి ఆ ఇండస్ట్రీ గొప్ప.. అంతేకానీ నార్త్ ఇండస్ట్రీ వేస్ట్ సౌత్ ఇండస్ట్రీ బెస్ట్ అన్నట్లుగా మాట్లాడడం నిజంగా ఇండస్ట్రీలో ఉండే వారికి సిగ్గుచేటే అన్నట్లుగా కామెంట్లు పెడుతున్నారు.
అయితే రాశిఖన్నా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది హిందీ సినిమా ద్వారానే.. మద్రాస్ కేఫ్ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత తెలుగు సినిమాల ద్వారానే ఫేమస్ అయ్యింది. తెలుగుతోపాటు తమిళ, మలయాళ సినిమాల్లో కూడా రాణించి ఓ మోస్తారు గుర్తింపు సంపాదించింది. కానీ ఈ హీరోయిన్ కి తెలుగులోనే ఎక్కువమంది అభిమానులు ఉన్నారు. అయితే ప్రస్తుతం రాశిఖన్నా మాట్లాడిన ఈ మాటల వల్ల భవిష్యత్తులో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో అవకాశాలు రావు అనే టాక్ కూడా వినిపిస్తుంది.
ఈ హీరోయిన్ నటించిన తెలుసు కదా మూవీ విషయానికి వస్తే..పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జి.విశ్వప్రసాద్ , వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న ఈ మూవీలో సిద్ధూ జొన్నలగడ్డ,రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిలు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 17న దీపావళి కానుకగా విడుదల కాబోతోంది.
ALSO READ:khushboo:కరూర్ ఘటన పక్కా ప్లానింగ్.. అనుమానాలు రేకెత్తించిన ఖుష్బూ!