Keerthy Suresh Latest Photos: గత రెండేళ్లలో చాలామంది హీరోయిన్లు పెళ్లి పీటలెక్కారు. అలా పెళ్లి చేసుకొని కూడా తమ కెరీర్‌ను ముందుకు నడిపిస్తున్నారు. అలాంటి వారిలో కీర్తి సురేశ్ కూడా యాడ్ అవ్వనుంది. (Image Source: Keerthy Suresh/Instagram)
కేరళకు చెందిన బిజినెస్‌మ్యాన్ ఆంటోనీతో కీర్తి ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందని వార్తలు వచ్చాయి. అలా వార్తలు వచ్చిన కొన్నిరోజుల్లోనే తనే అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. (Image Source: Keerthy Suresh/Instagram)
గత 15 ఏళ్లుగా ఆంటోనీతో రిలేషన్‌షిప్‌లో ఉన్నానని ఫోటోను షేర్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా కన్ఫర్మ్ చేసింది కీర్తి. డిసెంబర్ 12న వీరిద్దరూ డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని కూడా వార్తలు వైరల్ అవుతున్నాయి. (Image Source: Keerthy Suresh/Instagram)
త్వరలోనే ప్రేమించిన వాడితో పెళ్లికి సిద్ధమయ్యింది కాబట్టి కొత్తగా ముస్తాబయ్యి ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది కీర్తి సురేశ్. (Image Source: Keerthy Suresh/Instagram)
ప్రస్తుతం తన మొదటి బాలీవుడ్ మూవీ ‘బేబి జాన్’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది కీర్తి సురేశ్. వరుణ్ ధావన్‌తో కీర్తి నటించిన ఈ మూవీ నుండి ఒక పాట కూడా విడుదలయ్యి మంచి హిట్ అయ్యింది. (Image Source: Keerthy Suresh/Instagram)
ఒకవైపు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నా ‘బేబి జాన్’ కూడా డిసెంబర్‌లోనే విడుదల అవుతుండడంతో ఆ ప్రమోషన్స్‌కు కూడా సమయాన్ని కేటాయిస్తూ ఫుల్ బిజీగా గడిపేస్తోంది కీర్తి సురేశ్. (Image Source: Keerthy Suresh/Instagram)