BigTV English

Biryani: 50 రూపాయలకే చికెన్ దమ్ బిర్యాని మావా.. ఎక్కడో తెలుసా..?

Biryani: 50 రూపాయలకే చికెన్ దమ్ బిర్యాని మావా.. ఎక్కడో తెలుసా..?

Biryani: బిర్యానీ ఈ పేరు వినగానే నోట్లో లాలాజలం పుడుతుంటుంది. మన దేశంలో 100లో 99 మందికి ఫేవరేట్ ఫుడ్ లిస్టులో బిర్యానీ ఖచ్చితంగా ఉంటుంది. అందులో వెజిటేరియన్ లేదా నాన్ వెజిటేరియన్ ఏదైనా కోవచ్చు. కానీ బిర్యానీ తినగానే వచ్చే అనుభూతి వేరే అబ్బా. వెజిటేరియన్స్‌కి అయితే పెద్దగా ఆప్షన్ లేకపోవచ్చు కానీ నాన్ వెజ్ ప్రియులకు మాత్రం పండగే పండగ. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, ఫ్రాన్స్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ ఇలా ప్రపంచంలో 30 రకాల బిర్యానీలు ఉన్నాయి.


అందులోను మన హైదరాబాద్ దమ్ బిర్యానీ అయితే వరల్డ్ ఫేమస్. గల్లీ నుండి ఢిల్లీదాకా బిర్యానీకి ఉండే క్రేజ్.. మోజు నెక్ట్స్ లెవల్ అంతే.. వారానికి ఒకసారైనా బిర్యాని తినాల్సిందే.. అంతలా ఇష్టపడుతుంటారు. దేశవ్యాప్తంగా బిర్యానీ ప్రియుల సంఖ్య రోజు రోజుకి పెరుగుపోతుంది. కస్టమర్ల అభిరుచులకు తగ్గట్టూ.. సరికొత్త పద్ధతిలో.. వెరైటీ రుచులతో ఫుడ్ అందుబాటులోకి వస్తున్నాయి.

అయితే ఏ హోటల్స్‌కి .. రెస్టారెంట్లకి వెళ్లిన బిర్యాని ధర మాత్రం దాదాపు 200 పైనే ఉంటుంది. రెస్టారెంట్ టేస్ట్‌ను బట్టి కాస్ట్‌ను బట్టి బిర్యానీ రేటు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ ఎప్పుడైనా బిర్యానీని 50 రూపాయలకు తిన్నారా.. వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ.. నిజం అండీ.. ఓ హోటల్ కేవలం 50 రూపాయలకే బిర్యానీని అందిస్తుంది. ఇది ఎక్కడో కాదు.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే.


Also Read: పార్టీ కార్యాలయాలకు భూ కేటాయింపులు.. న్యాయస్థానంలో విచారణ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో కొత్తగా పెట్టిన ఓ రెస్టారెంట్‌కి జనం పెద్దఎత్తున ఎగబడ్డారు. నాయుడు రెస్టారెంట్ ప్రారంభోత్సవం సందర్భంగా 50 రూపాయలకే చికెన్ బిర్యానీ ఆఫర్ ప్రకటించారు. ఈ వార్త కాస్తా చుట్టూ పక్కల జనం వరకు పాకింది. దీంతో బిర్యానీ లవర్స్ అంతా రెస్టారెంట్ ముందు భారీగా క్యూ కట్టారు. హోటల్ ముందు నుంచి బయట రహదారి వెంట జనం బారులు తీరారు. అయితే బిర్యానీ చేతికొచ్చేందుకు గంటల టైం పడుతున్నా.. క్యూ లెన్ లోనే వెయిట్ చేస్తున్నారు.

 

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×