kriti Kharbanda (1)
Kriti Kharbanda Latest Photos: హీరోయిన్ కృతి కర్బందా గురించి ప్రత్యే కంగా పరిచయం అవసరం లేదు. ఒంగోలు గీత్త చిత్రంలో తెలుగులో ఈ భామకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతకు ముందే బోణి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.
kriti Kharbanda (2)
కానీ, ఆమెకు గుర్తింపు వచ్చింది మాత్రం ఒంగోలు గిత్త మూవీతోనే. ఇందులో హీరో రామ్ పోతినేని సరసన నటించిన ఆమె.. అల్లరి పిల్లగా కనిపించింది. హీరోని అసహ్యించుకుంటూనే అతడితో ప్రేమలో పడుతుంది. అలా కోపం, ప్రేమ, అల్లరి ప్రదర్శిస్తూ తనదైన నటనతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది.
kriti Kharbanda (3)
ముఖ్యంగా ఈ సినిమాలో కృతి కర్బందా అందం, అభినయంకు కుర్రకారు ఫిదా అయ్యింది. ఈ మూవీ ఆమె మంచి గుర్తింపు ఇచ్చినప్పటి అవకాశాలు మాత్రం పెద్దగా వరించలేదు. ఈ సినిమా తర్వాత తీన్మార్ కనిపించింది. కానీ, ఇందులో ఆమె రోల్ నామమాత్రంగానే ఉంది.
kriti Kharbanda (4)
పెద్దగా నటనకు స్కోప్ లేదు. పైగా మూవీకి విజయం లేదు. దీంతో కృతి పాపకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. ఇక అవకాశాలు తగ్గడంతో కన్నడ నుంచి ఆమెకు పిలుపు వచ్చింది. అలా చిర్రు" (2010) శాండల్‌వుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత సూపర్ రంగ మూవీలో నటించింది.
kriti Kharbanda (5)
ఈ రెండు సినిమా సూపర్ హిట్ అయ్యాయ్యి. కన్నడలో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ పడ్డాయి. ఇక ఆమె నటించిన సూపర్ రంగ సినిమాకు గానూ ఆమెకు సైమా అవార్డు కూడా వరించింది. ఆ తర్వాత తెలుగులో బ్రూస్ లీ: ది ఫైటర్ చిత్రంలో నటించింది.
kriti Kharbanda (6)
హిందీలోనూ గెస్ట్ ఇన్ లండన్, పాగల్ పంతీ(2019) మూవీలో నటించి గుర్తింపు పొందింది. ఇక సినిమాలకు గ్యాప్ తీసుకున్న ఈ భామ 2024లో నటుడు పుల్కిత్ సమ్రాట్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం ఆమె రిస్కీ రోమియో చిత్రంలో నటిస్తోంది.