Meenakshi Chaudhary: లక్కీ భాస్కర్ హిట్‌తో ఫుల్ జోష్‌లో ఉంది హీరోయిన్ మీనాక్షి చౌదరి.
ఇదే ఊపులో వచ్చే ఏడాది ఇయర్ ఛార్ట్ ఫుల్ చేసుకునే పనిలో పడింది.
27 ఏళ్ల హర్యానా బ్యూటీ కాసింత ఆలస్యంగా గ్లామర్ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.
ఐదేళ్ల కిందట పరిశ్రమలోకి వచ్చినా.. తనకంటూ సరైన ఇమేజ్ సొంతం చేసుకోలేకపోయింది.
లక్కీ భాస్కర్ హిట్‌తో అభిమానులకు మరింత దగ్గరైంది. కాకపోతే ఇందులో ఫ్యామిలీ మహిళగా కనిపించింది.
గ్లామర్ ట్రాక్ మిస్సవుతుందా అనే డౌట్ అభిమానుల్లో మొదలైంది.
ఈ క్రమంలో రకరకాల ఫోటోషూట్లు చేస్తోంది. లేటెస్ట్‌గా రెడ్ కలర్ డ్రెస్‌తో కాసింత స్పైసీగా కనిపించింది.
గ్లామర్ రోల్స్ తాను ఏమాత్రం దూరంగా కాలేదంటూ చెప్పే ప్రయత్నం చేసింది.. చేస్తోంది కూడా.
అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.