BigTV English

Pushpa 2 : సినిమాలో అల్లు అర్జునే మైనస్… సెకండ్ పార్ట్ లో మరీ కామెడీగా?

Pushpa 2 : సినిమాలో అల్లు అర్జునే మైనస్… సెకండ్ పార్ట్ లో మరీ కామెడీగా?

Pushpa 2 : ‘పుష్ప 2 : ది రూల్’ మూవీని బిగ్ స్క్రీన్ పై చూడడానికి ఈగర్ గా వెయిట్ చేస్తున్న మూవీ లవర్స్ ఎదురు చూపులకు ఈరోజుతో తెర పడింది. గత మూడేళ్ల నిరీక్షణ తర్వాత ‘పుష్ప 2’ (Pushpa 2) మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే సినిమాను చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా ఈ మూవీలోని విశేషాలను పంచుకుంటున్నారు. ఈ సందర్భంగా సినిమాలో ఆ ఒక్క పాయింట్ మెయిన్ మైనస్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఆ మైనస్ ఏంటి? అనే విషయంలోకి వెళ్తే…


డిసెంబర్ 5న ‘పుష్ప 2 : ది రూల్’ మూవీ ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అయింది. అయితే తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4 నుంచి ఈ సినిమా పెయిడ్ ప్రీమియర్లను వేశారు. నిజానికి గత కొంతకాలం నుంచి ‘పుష్ప 2’ (Pushpa 2) నామస్మరణ జరుగుతుంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించి డిస్కషన్ నడుస్తోంది. ఇక ఇప్పుడు సినిమా తెరపై కనిపించాక ఆ డిస్కషన్ మరింతగా పెరిగింది. అందులో భాగంగానే ఈ సినిమాలో ఉన్న మైనస్ పాయింట్స్ ను సోషల్ మీడియా ద్వారా బయట పెడుతున్నారు. ఇక అసలు విషయంలోకి వెళ్తే… ఈ సినిమాలో అల్లు అర్జున్ మ్యానరిజం అతిపెద్ద మైనస్ అంటున్నారు నెటిజన్లు. ఫస్ట్ పార్ట్ లో వర్కవుట్ అయింది కానీ, సెకండ్ పార్ట్ లో మాత్రం మరీ కామెడీగా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మ్యానరిజం మాత్రమే కాదు ఆ యాస కూడా మైనస్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ చెప్పే డైలాగ్స్ అర్థం అవడం లేదని కంప్లైంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో అల్లు అర్జున్ (Allu Arjun) రాయలసీమ యాసలో మాట్లాడిన సంగతి తెలిసిందే. ఫస్ట్ పార్ట్ లో అయితే ఆయన స్లాంగ్ పరంగా ఎలాంటి కంప్లైంట్స్ రాలేదు. కానీ సెకండ్ పార్ట్ లో అల్లు అర్జున్ నోట్లో పాన్ ఎక్కువగా ఉండటం వల్ల డైలాగులు సరిగ్గా పాలకపోయాడని చెబుతున్నారు. నిజానికి తెలుగు రాష్ట్రాల్లో కామన్ గా ఉండే పదాలు వాడితే… యాస ఏదైనా జనాలు అర్థం చేసుకోవడానికి పెద్దగా కష్టపడరు. కానీ పక్కా రాయలసీమ స్లాంగ్ వాడితే మాత్రం కొన్ని పదాలు మిగతా ప్రాంతాల వారికి అర్థమయ్యే అవకాశం ఉండదు. మరి మొదటి పార్ట్ లో ప్లస్ పాయింట్ అయినా స్లాంగ్, మ్యానరిజం… సెకండ్ పార్ట్ లో మాత్రం మైనస్ అయ్యే ఛాన్స్ ఉందా? నెటిజన్లు చేస్తున్న కంప్లయింట్స్ నే ఆడియన్స్ కూడా చేస్తారా ? అనేది తెలియాలంటే రివ్యూ వచ్చేదాకా వెయిట్ అండ్ సి.


ఇదిలా ఉండగా ఈ చిత్రంలో అల్లు అర్జున్ పుష్ప రాజ్, రష్మిక మందన్న శ్రీవల్లి, ఫహద్ ఫాసిల్ ఎస్పీ భన్వర్ సింగ్ షెకావత్, జగదీప్ ప్రతాప్ బండారి కేశవ, సునీల్ మంగళం శ్రీను, అనసూయ భరద్వాజ్ దాక్షాయణి, రావు రమేశ్ ఎంపీ భూమిరెడ్డి, జాలి రెడ్డిగా ధనంజయ, మొల్లేటి ద్రమ రాజ్‌గా శ్రీతేజ్, చెన్నై మురుగన్‌గా మైమ్ గోపి, సబ్ ఇన్‌స్పెక్టర్ కుప్పరాజ్‌గా బ్రహ్మాజీ, పార్వతమ్మగా కల్పలత నటించారు. సీక్వెల్‌లో వీరంతా తిరిగి తమ పాత్రలను పోషించారు. జగపతి బాబు, ప్రకాష్ రాజ్ మాత్రం సీక్వెల్ లో యాడ్ అయ్యారు. ఇక ‘కిస్సిక్’ అనే స్పెషల్‌ ఐటమ్‌ ట్రాక్‌లో శ్రీలీల మెరిసింది.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×