Pushpa 2 Movie Public Reation : ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్, రష్మీక మందన్న జంటగా నటించిన పుష్ప మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురు చూపులు ఈరోజుతో సంబరాలు చేసుకుంటున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పుష్ప 2 మూవీ థియేటర్లలో విడుదలైంది. డిసెంబర్ 4 న ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇక ఫ్యాన్స్ ట్విట్టర్ వేదికగా సినిమా పై రియాక్ట్ అవుతున్నారు. సినిమా గురించి తమ అభిప్రాయాలను నెట్టింట పంచుకున్నారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలయిందని ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సినిమాను చూసేందుకు థియేటర్ల వద్ద బారులు తీరారు. కొన్ని చోట్ల పరిస్థితులు దారుణంగా మారాయి. తొక్కిసలాటలు జరిగాయి. నిన్న రాత్రి హైదరాబాద్ లోని ఓ థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతి చెందిందని తెలుస్తుంది. ఆమె కొడుకు పరిస్థితి విషమంగా ఉందని ఓ వార్త వినిపిస్తుంది.
అసలు విషయానికొస్తే.. హీరో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో దిల్‌సుఖ్ నగర్‌కు చెందిన రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తొమ్మిదేళ్ల శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. రాత్రి 9.30 గంటల ప్రీమియర్ షో చూసేందుకు రేవతి, ఆమె భర్త భాస్కర్, ఇద్దరు పిల్లలు శ్రీతేజ్, సన్వీక లు దిల్‌సుఖ్ నగర్ నుంచి సంధ్య థియేటర్‌కు వచ్చారు. కొత్త సినిమాల రిలీజ్ అవుతున్నాయంటే అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయో ఊహించడం కష్టమే. ఇప్పుడు అలాంటి పరిస్థితి నెలకొందని తెలుస్తుంది. అల్లు అర్జున్ సినిమాలకు ఉన్న క్రేజ్ ఇదే.. ఇక జనాలను చూసేందుకు అల్లు అర్జున్ అక్కడికి రావడం తో ఫ్యాన్స్ ఆయనను చూసేందుకు ఎగబడ్డారు. దాంతో అక్కడ తొక్కిసలాట జరిగిందని తెలుస్తుంది.
తమ అభిమాన హీరో అక్కడకు రావడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. అల్లు అర్జున్ థియేటర్ లోకి వెళ్లాక.. అభిమానులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. అయిన జనాన్ని కంట్రోల్ చెయ్యలేకపోయారు. అప్పుడు జరిగిన తోపులాటలో రేవతి, ఆమె కుమారుడు, మరో వ్యక్తి కిందపడి స్పృహ కోల్పోయారు. పోలీసులు వారికి ప్రథమ చికిత్స చేసి.. ఆంధ్ర మహిళా సభ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి తీసుకొచ్చేసరికే రేవతి మరణించినట్టు వైద్యులు తెలిపారు. ఆమె మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆమె కుమారుణ్ని మరింత మెరుగైన చికిత్స నిమిత్తం వేరే ఆస్పత్రి కి తరలించారు. కాగా.. స్పృహతప్పిన బాలుడు శ్రీతేజ్ కు పోలీసులు అక్కడే బయట సీపిఆర్ చేశారు కానీ పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తుంది. పోలీసులు సీపిఆర్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.. ప్రస్తుతం ఆ బాలుడి పరిస్థితి ఎలా ఉందో తెలియాల్సి ఉంది.. అల్లు అర్జున్ సినిమా రిలీజ్ సమయం లో ఇలా జరగడం పై ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. దీని పై హీరో స్పందించాల్సి ఉంది..