Mrunal Thakur Latest Photos: నటీనటులు ప్రేక్షకులకు దగ్గరవ్వాలంటే ఒక్క సినిమా చాలు.. అలాగే మృణాల్ ఠాకూర్‌ను ప్రేక్షకులకు దగ్గర చేసిన సినిమా ‘సీతారామం’.

‘సీతారామం’లో సీతగా నటించి ఒక్కసారిగా అందరి దృష్టిలో తను కూడా సీతగా మారిపోయింది మృణాల్.

మరాఠీ అమ్మాయి అయినా.. హిందీలో హీరోయిన్‌గా డెబ్యూ చేసినా.. తనకు తెలుగు ప్రేక్షకుల నుండే ఎక్కువగా ఆదరణ లభించింది.

మామూలుగా ఆర్టిస్టులకు ఒక్క సినిమా మైల్‌స్టోన్‌గా నిలిచిపోవడమే పెద్ద విషయం. అలాంటిది మృణాల్ కెరీర్‌లో రెండు సినిమాలు ఉన్నాయి.

‘సీతారామం’ తర్వాత నానితో కలిసి ‘హాయ్ నాన్న’ మూవీలో నటించింది మృణాల్ ఠాకూర్.

‘సీతారామం’లో సీతగా తనను ప్రేక్షకులు ఎంత ఆదరించారో.. ‘హాయ్ నాన్న’లో యష్న పాత్రతో కూడా తను ఆడియన్స్‌కు అంతే దగ్గరయ్యింది.

అలా కెరీర్ మొదట్లోనే బ్యాక్ టు బ్యాక్ గుర్తుండిపోయే హిట్స్ అందుకుంది మృణాల్. అంతే కాకుండా తనకు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

ఆన్ స్క్రీన్ పక్కింటమ్మాయి క్యారెక్టర్స్ చేసే మృణాల్.. ఆఫ్ స్క్రీన్ మాత్రం చాలా మోడర్న్‌గా ఉంటుంది.

ఎప్పటికప్పుడు తన గ్లామర్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. కానీ ప్రేక్షకులకు మాత్రం తనను ట్రెడీషినల్‌గా చూడడమే ఇష్టం.

తాజాగా వైట్ చుడీదార్‌లో ఫోటోలు షేర్ చేసి తన ఫ్యాన్స్‌ను హ్యాపీ చేసింది మృణాల్. ఈ ఫోటోలు చూసినవారంతా వారెవ్వా అనుకుంటున్నారు.
