E-Paper
Advertisement

Anupama: అనుపమ మార్ఫింగ్ ఫోటోలు.. నిందితులు ఎవరో తెలిసిందంటూ పోస్ట్!

Anupama: అనుపమ మార్ఫింగ్ ఫోటోలు.. నిందితులు ఎవరో తెలిసిందంటూ పోస్ట్!
Advertisement

Anupama:ప్రస్తుత కాలంలో కొంతమంది ఆకతాయిలు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ మార్ఫింగ్ ఫోటోలు చేసి.. వాటిని సోషల్ మీడియాలో వదులుతున్నారు. వీటివల్ల సెలబ్రిటీలు ఏ రేంజ్ లో ఇబ్బందులు పడుతున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతేకాదు చిరంజీవి (Chiranjeevi)ని మొదలుకొని నాగార్జున (Nagarjuna), ఐశ్వర్యరాయ్, అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, కరణ్ జోహార్ ఇలా ఎంతోమంది ఇలాంటి వాటి బారిన పడకుండా ముందస్తుగానే కోర్టును ఆశ్రయించి అనుమతులు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి అయితే ఈ మార్ఫింగ్ ఫోటోల వల్ల ఇబ్బందులు పడుతూ.. సిటీ సివిల్ కోర్టు అలాగే వీసీ సజ్జనార్ ను కూడా కలిసి అసలు విషయాన్ని తెలిపారు.

అనుపమ మార్ఫింగ్ ఫోటోలు వైరల్..

ఇప్పుడు అనుపమ పరమేశ్వరన్ కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. అయితే ఆ మార్ఫింగ్ ఫోటోలు ఎవరో చేశారు. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటంటే.. ఇలాంటి పనులు చేసేది అబ్బాయిలని అందరూ అనుకునేవారు. కానీ ఇప్పుడు ఆడవాళ్లకు ఆడదే శత్రువు అన్నట్లు కొంతమంది అమ్మాయిలు కూడా హీరోయిన్లను వేధిస్తున్నారని తెలిసి షాక్ అయ్యారు. ఇకపోతే తాజాగా అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో పోస్ట్ పెడుతూ.. “కొన్ని రోజుల క్రితం నా దృష్టికి ఒక ఇంస్టాగ్రామ్ ప్రొఫైల్ వచ్చింది. అయితే అందులో నా గురించి తప్పుడు సమాచారాన్ని షేర్ చేశారు. నా కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులను తోటి నటీనటులను కూడా ట్యాగ్ చేస్తున్నారు. ఆ అకౌంట్ నుంచి వచ్చిన పోస్టుల్లో మార్ఫింగ్ చేసిన ఫోటోలు కూడా ఉన్నాయి. ఎటువంటి ఆధారాలు లేని తప్పుడు సమాచారం.. ఆరోపణలు కూడా ఉన్నాయి.

20 ఏళ్ల అమ్మాయి చేసిందంటూ..

Advertisement

ముఖ్యంగా కావాలని నన్ను టార్గెట్ చేశారని అర్థమయింది. ఎవరు ఈ పని చేస్తున్నారని తెలుసుకోవడానికి ప్రయత్నించగా.. మల్టిపుల్ అకౌంట్ క్రియేట్ చేసి నన్ను టార్గెట్ చేశారనీ.. తప్పుడు అకౌంట్స్ ద్వారా తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేశారు అని తెలిసి.. తర్వాత నేను కేరళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాను. ఆ ఇన్వెస్టిగేషన్లో తమిళనాడుకు చెందిన 20 ఏళ్ల అమ్మాయి నన్ను టార్గెట్ చేసింది అని తెలిసి ఆశ్చర్యపోయాను.. అయితే ఆమె వయసుని చూసి ఆమె గుర్తింపును బయటకు పెట్టాలని అనుకోవడం లేదు. కానీ చట్టం తన పని తాను చేసుకు వెళ్తుంది. సెలబ్రిటీలకు కూడా సామాన్యులకుండే హక్కులు ఉంటాయి. అందుకే మేము ప్రతిదీ కూడా చట్ట ప్రకారమే ముందుకు వెళ్లాలనుకుంటున్నాము” అంటూ అనుపమ తన పోస్టులో పంచుకుంది.

అనుపమ పై నెటిజన్స్ ప్రశంసలు..

ఇకపోతే అనుపమ షేర్ చేసిన ఈ పోస్ట్ పై నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇంత దారుణంగా వేధించినా కూడా ఆ అమ్మాయి వయస్సును దృష్టిలో పెట్టుకొని బయటకు రివీల్ చేయనని చెప్పడంతో ఆమెపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

అనుపమ సినిమాలు..

Advertisement

ఇటీవలే బైసన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన ఈమె.. ఇంతకుముందు పరదా , కిష్కిందపురి, డి పెట్ డిటెక్టివ్ చిత్రాలలో నటించింది.

also read:Maheshbabu : హీరోగా ఘట్టమనేని జయకృష్ణ లాంఛ్.. శ్రీనివాస్ మంగాపురం టైటిల్ తో!

Related News

నాగార్జున ‘కింగ్ 100’ నుంచి దసరా సర్‌ప్రైజ్.. అదేంటో తెలుసా ?

బాలీవుడ్‌లో కాల్పుల కలకలం.. టైగర్ ష్రాఫ్‌కు ఏమైంది?

40 ఏళ్ల తర్వాత కాశీకి వెళ్లిన రేణు దేశాయ్.. అక్కడ ఏం జరిగిందంటే?

విజయ్ యాక్షన్‌కు ఫిదా అయిన సందీప్ వంగా.. ఆర్జీవీ రియాక్షన్ మామూలుగా లేదుగా!

బాలు సినిమాలో పవన్ వేసుకున్న ప్యాంట్స్ వెనుక ఇంత కథ ఉందా?

పవన్ కళ్యాణ్‌తో విడిపోయాక నా పరిస్థితి ఇదే.. రేణు దేశాయ్ కామెంట్స్!

నవరాత్రుల వేళ హెబ్బా పటేల్ స్పెషల్ ట్రీట్..ఫ్యాన్స్‌కు కనువిందే!

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్ మూవీ ‘కిల్లర్’.. ఒకేసారి రెండు అప్డేట్స్!

Big Stories

Advertisement
×