BigTV English
Advertisement

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!

Bigg Boss 9 Promo:బిగ్ బాస్.. వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో గా పేరు సొంతం చేసుకున్న ఈ షో తెలుగులో 9వ సీజన్ నడుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సండే లో భాగంగా 63వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను నిర్వాహకులు విడుదల చేయగా.. ఇందులో కంటెస్టెంట్స్ తో గేమ్స్ ఆడించి, మంచి ఎంటర్టైన్మెంట్ అందించారు నాగార్జున. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రీతూతో జాగ్రత్త అంటూ నాగార్జున చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మరి ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.


లేటెస్ట్ ప్రోమో రిలీజ్..

తాజాగా 63వ రోజుకు సంబంధించిన మొదటి ప్రోమోను రిలీజ్ చేస్తూ.. అందులో సండే ఎంటర్టైన్మెంట్ అంటూ కంటెస్టెంట్స్ తో ఒక ఆట ఆడించారు నాగార్జున..ఇక స్టేజ్ పైకి రాగానే హౌస్ మేట్స్ తో నాగార్జున మాట్లాడుతూ.. నేనొక క్లిప్పు చూపిస్తాను. దాని తర్వాత క్వశ్చన్ అడుగుతాను. ఎవరైతే గంట కొట్టి ఆన్సర్ చెబుతారో వారే విజేత అంటూ ఆట గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు నాగార్జున. ఆ తర్వాత టాస్క్ లో భాగంగా అక్కడ ఒక సాంగ్ ప్లే చేయగా బ్రహ్మానందం ధరించిన స్పెక్స్ కలర్ ఏంటి ? అని అడగగా గోల్డెన్ బ్లాక్ కలర్ అని పవన్ సమాధానం ఇచ్చారు.

టాలెంట్ తో అదరగొట్టేసిన రీతు చౌదరి..

ఇక తర్వాత బాబి గర్ల్ అనే పాటను ప్లే చేయగా.. అందులో కిస్సిక్ అని ఎన్నిసార్లు వచ్చింది అని అడిగితే ఆత్రంతో ముందే బెల్ మోగించిన తనూజ సారీ చెప్పేసింది. ఆ తర్వాత కళ్యాణ్ ఆన్సర్ చెప్పి విన్ అయ్యారు. తర్వాత రీతు చౌదరి, ఇమ్మానుయేల్ వచ్చారు. నాగార్జున మాట్లాడుతూ.. చాలా జాగ్రత్తగా ఆడు.. వచ్చింది రీతు చౌదరి అంటూ తెలిపారు. ఇమ్మూ మాట్లాడుతూ నెత్తికేసి కొట్టినా కొడుతుంది సార్ అంటూ చెప్పగా కరెక్ట్ గా చెప్పావంటూ నాగార్జున వత్తాసు పలికారు. తర్వాత పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమాలోని బొంగరాల లాంటి కళ్ళు తిప్పింది అనే సాంగ్ ప్లే చేయగా ఇందులో ప్రణీత వేసుకున్న గాజుల కలర్ గురించి అడిగారు నాగార్జున. బేబీ పింక్ అంటూ ఆన్సర్ చెప్పి విన్ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ . అలా మొత్తానికి అయితే తన టాలెంట్ ను నిరూపించుకుంది.


also read:Siva Re Release: చిరంజీవికి క్షమాపణలు చెప్పిన ఆర్జీవీ.. పశ్చాతాపడుతున్నాడా?

గ్రాస్పింగ్ పవర్ కి ఫిదా..

వరుసగా రీతు చౌదరి టీం విన్ అవుతూ ఉంటే అన్ని చెప్పేస్తున్నారు ఈ టీం తో ఇంకెందుకు గేమ్ కంటిన్యూ చేయడం అని తెలిపారు నాగార్జున. ఇమ్మూ మాత్రం.. లేచి సార్ మేము ఒక్కలమే విన్ అయ్యాం.. మళ్ళీ ఆడతామని అడగగా.. లాస్ట్ ఛాన్స్ ఇచ్చారు నాగార్జున.. డోంట్ మ్యారీ బీ హ్యాపీ అనే పాట ప్లే చేయగా.. ఫ్లాష్ బ్యాక్ లో ఎన్ని టీషర్ట్స్, ఎన్ని క్యారెక్టర్స్ మార్చారు అని పవన్ ముందే గెస్ చేయగా.. ఎన్ని అని అడిగాడు నాగార్జున. సిక్స్ అని చెప్పగా సెవెన్ అని రీతు కరెక్ట్ ఆన్సర్ చెప్పింది అలా రీతు చౌదరి టీం విన్ అయిపోయింది. మొత్తానికైతే ఈ షోలో రీతు చౌదరి గ్రాస్పింగ్ పవర్ కి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Related News

Bigg Boss 9 Telugu : సింగర్ రామ్ రాథోడ్ సెల్ఫ్ ఎలిమినేట్.. ఎంత సంపాదించడంటే..?

Bigg Boss 9 : ఎంత నటిస్తావమ్మా? అప్పుడు పురుగుల చూసావు ఇప్పుడు ఉన్నాను అంటున్నావ్

Bigg Boss 9: అది సుమన్ శెట్టి అంటే, అందుకే ఇంత మంది ఇష్టపడుతున్నారు

Bigg Boss 9: మరోసారి తన సెల్ఫిష్ బిహేవర్ బయట పెట్టిన ఇమ్మానియేల్

Bigg Boss 9 Telugu : ముద్దుబిడ్డ తనూజాకు బిగ్ బాస్ స్పెషల్ ఆఫర్… కళ్యాణ్ బలి… ఇదేం తుప్పాస్ గేమ్ బాసూ ?

Bigg Boss 9 Telugu Day 62 : ఇమ్మూ, రీతూ ఇంత సెల్ఫిషా ? కంటెస్టెంట్స్ ఎమోషన్స్ తో ఆటాడుకున్న నాగ్… రామూ షాకింగ్ ఎలిమినేషన్

Bigg Boss Tamil: ప్రాంక్‌ పేరుతో కొట్టుకున్న కంటెస్టెంట్స్‌.. ఫైర్‌ అయిన హోస్ట్‌!

Big Stories

×