Jubill Hill bypoll: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ దివంగత మాజీ ఎమ్మెల్యే గోపీనాథ్ మరణంపై హాట్ హాట్‌గా చర్చ సాగుతోంది. దీనిపై రాజకీయ పార్టీలు బీఆర్ఎస్‌పై ముప్పేట దాడి మొదలు పెట్టాయి. ఈ సమస్యపై తొలుత గోపీనాథ్ తల్లి లేవనెత్తారు. దీంతో ఆ అంశం కాంగ్రెస్-బీజేపీ పార్టీలకు అస్త్రంగా మారింది. ఈ వ్యహారంపై వివిధ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు కేటీఆర్.
జూబ్లీహిల్స్ బైపోల్ వేళ గోపీనాథ్ మరణంపై చర్చ
గోపీనాథ్ మరణంపై ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. మాగంటి గోపీనాథ్ తల్లి మహానంద కుమారి చేసిన ఆరోపణలపై స్పందించారు కేటీఆర్. ఇటీవల ఆయన ఆమె రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మృతి రోజు తనను అడ్డుకుని కేవలం కేటీఆర్‌ను అనుమతించడంపై అనుమానం వ్యక్తం చేశారు ఆమె. తన కొడుకును చూపించాలని కేటీఆర్‌ని కోరినా ఎలాంటి స్పందన రాలేదన్నారు.
ఈ వ్యవహారంపై కేటీఆర్ నోరు విప్పారు. గోపీనాథ్ చనిపోయి ఆరు నెలల తర్వాత ఆమె ఇలా మాట్లాడుతున్నారంటే వెనుక కాంగ్రెస్ నేతలున్నారని ఆరోపించారు. గోపీనాథ్ తల్లి వెనుక ఇద్దరు కాంగ్రెస్ నేతలు ఉన్నారని, ఆ ఫోటో చూస్తే తెలుస్తుందన్నారు. ఈ విషయంలో అధికార పార్టీ, బీజేపీలు దిగజారిపోయాయని ఆరోపించారు. గోపీనాథ్ చనిపోయిన సమయంలో తాను అమెరికా ఉన్నానని, ఇక్కడ లేనన్నారు.
ఆరునెలల తర్వాత గుర్తొంచిందా? కేటీఆర్ ఫైర్
గోపీనాథ్‌కు సీరియస్‌గా ఉందని సమాచారం రావడంతో వెంటనే బయలుదేరి హైదరాబాద్‌కు వచ్చానన్నారు. తాను వచ్చిన తెల్లవారికే ఆయన మరణించారని తెలిపారు. ఏఐజీ హాస్సటల్‌లో ఇదంతా జరిగిందన్నారు. ఆరు నెలల తర్వాత గోపీ మరణం ఇప్పుడు గుర్తు రావడం ఏంటన్నారు. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్న సమయంలో గోపీ విషయం ఎలా గుర్తుకు వచ్చిందని ప్రశ్నించారు. దీన్నిబట్టి ఎవరు బుద్ది, వాదన ఏంటో తెలుస్తుందన్నారు.
గోపీ చనిపోయిన నుంచి అంత్యక్రియల వరకు ఆయన తల్లి దగ్గరే ఉన్నారని గుర్తు చేశారు కేటీఆర్. కేసీఆర్ నివాళులు అర్పించడానికి వచ్చినప్పుడు ఆయన కుటుంబసభ్యులను తాను పరిచయం చేశానని అన్నారు. ఆ రోజు ఇవన్నీ గుర్తుకు రాలేదా? వారి కుటుంబంలో గొడవలు ఎప్పుడి నుంచో జరుగుతున్నాయని వివరించారు.
ALSO READ: అదృష్టంగా భావిస్తున్నా-ఎమ్మెల్యే పాయం
గోపీ మృతిపై విచారణ జరపాలని ఆయన కుటుంబసభ్యులు కోరుతున్నారని అడిగిన ప్రశ్నకు సీరియస్‌గా రియాక్ట్ అయ్యారు కేటీఆర్.కనీసం సంస్కారం కూడా వారి లేదా? ఆయన భార్య ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి అని, ఆమె ఏడిస్తే పార్టీలు రాజకీయం చేస్తున్నాయని అన్నారు. ఇంతకంటే చిల్లర రాజకీయాలు ఉంటాయా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బినామీ ఆస్తుల మాటేంటని అడిగేసరికి కాస్త ఆగ్రహానికి గురయ్యారు కేటీఆర్.
ఎవరికి ఎవరు బినామీ? ఇంత అల్పంగా మాట్లాడుతారని తెలీదన్నారు. బండి సంజయ్ చాలా చిల్లర వ్యక్తని, ఇంత నీచుడని తెలీదన్నారు. ఆ విషయంలో తనకు ఏంటి సంబంధమని ఎదురు ప్రశ్నించారు. ఇదే విషయంలో బండి సంజయ్ చేసిన ఆరోపణలపై నోరు విప్పిన కేటీఆర్, ఆయనొక పిచ్చోడని తేల్చి పారేశారు. ఆయన గురించి మాట్లాడాల్సిన అవసరం లేదన్నారు.
ఏఐజీ ఆసుపత్రి సెక్యూరిటీ ఇంఛార్జ్ కి మాగంటి గోపీనాథ్ కుమార్తె దిశిర రాసిన లేఖ..
మహానందకుమారితో పాటు గోపీనాథ్ అన్న వజ్రనాథ్, ఆయన కుటుంబ సభ్యులను లోపలికి అనుమతించవద్దంటూ దిశిర లేఖ
దిశిర లేఖను కూడా పోలీసులకు ఇచ్చిన మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి https://t.co/9VI8oZdEV5 pic.twitter.com/gbXe01VtSg
— BIG TV Breaking News (@bigtvtelugu) November 9, 2025