E-Paper
Advertisement

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే

Viral Video: ఆఫీసులో తింగరి వేషాలేంటి? హీటెక్కిపోయిన బ్యాంక్ మేనేజర్, ఆ తర్వాత ఏం జరిగిందంటే
Advertisement

Viral Video: ప్రభుత్వ ఆఫీసుల్లో వర్క్ పెరిగిందని పదే పదే చెబుతున్నారు వివిధ సంస్థల ఉద్యోగులు. అందుకు కారణాలు చాలానే ఉన్నాయి. పోటీ ప్రపంచం నేపథ్యంలో ఒత్తిడి ఉండడం సహజం. అంతేకానీ 80 దశకం మాదిరిగా వ్యవహరించాలంటే కుదిరే అవకాశం ఉండదు. ఈ విషయం పైస్థాయి ఉద్యోగులకు క్లియర్‌గా తెలుసు. లేటెస్ట్‌గా ప్రభుత్వ రంగ సంస్థ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లోని ఓ ఉద్యోగి.. తోటి మహిళా ఉద్యోగితో రీల్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. అసలు మేటరేంటి? ఇంకాస్త లోతుల్లో వెళ్తే..

బ్యాంకులోని మేజనర్ రూములో రీల్స్ హంగామా

Advertisement

రీల్స్ పిచ్చిలో యువతీ యువకులు మాత్రమే కాదు.. చివరకు ఆఫీసులో పని చేసే ఉద్యోగులకు టెంప్ట్ అవుతున్నారు. దీనివల్ల ఫేమస్ కావడమేకాదు.. డబ్బులు కూడా వస్తాయని ఆరాటపడుతున్నారు. తాజాగా నెట్టింట్లో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఎక్కడ.. ఏంటి.. అనేది కాసేపు పక్కన బెడదాం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆఫీసులోని మేనేజర్.. తన తోటి మహిళా ఉద్యోగితో రీల్స్ చేయడం ఆసక్తికరంగా మారింది. దీనికి సంబంధించి వీడియో వైరల్ అయ్యింది.

ఆఫీసులో వర్క్ చేస్తుండగా ఈ తతంగం జరిగింది. ఏకంగా బ్రాంచ్ మేనేజర్ అలోక్ కుమార్‌తో ‘సారా సారా దిన్ తుం కామ్ కరోగే తో ప్యార్ కబ్ కరోగే’ పాటకు రీల్ చేస్తూ అందులోని మహిళా ఉద్యోగి డ్యాన్స్ చేయడం కనిపించింది. మహిళా ఉద్యోగి లేక మరొకరో తెలీదు. బ్రాంచ్ మేనేజర్ వెనుక ఉండి పాటకు లిప్ సింక్ కలుపుతూ ఉంటే బ్రాంచ్ మేనేజర్ కుర్చీలో కూర్చొని ఫుల్ ఖుషీ అయిపోయాడు. ఆ తర్వాత హీటెక్కిపోయాడు. ఉద్యోగి వెనుక ట్రోఫీలు కనిపిస్తున్నాయి. అతడు సీరియస్‌గా డెస్క్‌పై ఫైల్స్ తిప్పుతూ కనిపిస్తున్నాడు.

Advertisement

హీటెక్కిపోయిన బ్యాంకు మేనేజర్, ఆ తర్వాత 

ఆ వీడియోపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు రేగుతున్నాయి. ప్రభుత్వ ఆఫీసుల్లో ఉన్నతస్థాయి అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తారా? అంటూ ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి. ఆఫీస్ సమయాన్ని ఈ విధంగా వినియోగించుకుంటారా? అంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. బ్యాంకింగ్ సర్కిల్స్‌లో ఈ వీడియో ఎక్కువగా షేర్ అవుతోంది. త్వరలో వారిని సస్పెండ్ చేస్తారని కొందరంటున్నారు. ప్రభుత్వం ఆఫీసుల్లో ఆ విధంగా ఎంటర్‌టైన్మెంట్ కూడా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.

ALSO READ:  తెలంగాణ బిడ్డకు రూ.240 కోట్ల లాటరీ

ఇదొక వెర్షన్ మాత్రమే. మరోవైపు ఏఐ వీడియోగా కొందరు చెబుతున్నారు. కావాలని కొందరు ఆకతాయులు ఈ విధంగా చేశారని అంటున్నవాళ్లు లేకపోలేదు. ఈ వ్యవహారంపై సదరు బ్యాంక్ విచారణకు ఆదేశించినట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఈ ఉద్యోగులపై యాక్షన్ ఉంటుందా? లేదా అనేది చూడాలి. ఏఐ రాజ్యమేలుతున్న టెక్ ప్రపంచంలో ఎవరేం చేస్తున్నారో అర్థం కావడం లేదు.

 

Related News

ఒకరిది ‘మర్డర్ ప్లాన్’.. మరొకరిది ‘బొందపెట్టే ప్లాన్’.. మెట్రోలో ‘కౌంటర్’ అదిరిందిగా!

వారేవ్వా బామ్మా! నేటి యువతకే ఛాలెంజ్ విసురుతూ.. 116 ఏళ్ల వృద్ధురాలు తిరుమల మెట్లు ఎలా ఎక్కారంటే?

నడిరోడ్డుపై దారుణం.. 8 బైక్‌లపై వచ్చి.. పోలీస్‌ను చితకబాదారు!

నేటి కాలంలోనూ ఇలాంటి గురుభక్తా? రిటైర్ అవుతున్న టీచర్‌కు ఊహించని సర్ప్రైజ్!

రాజపుత్‌ల వీరత్వానికి ప్రతీకలు.. కొండలపై రాజస్థాన్ కోటలు.. జీవితంలో ఒక్కసారైనా చూడాల్సిందే

అయ్య బాబోయ్.. 1454 అడుగుల ఎత్తులో టవర్‌పై లవ్‌ ప్రపోజ్‌.. ఆ సమయంలో జంట మధ్య ఏం జరిగిందంటే

సిరిసిల్లలో ఘోరం.. బూందీ మిక్చర్‌లో బల్లి కళేబరం.. ప్రశ్నిస్తే యజమాని ఏం చేశాడో తెలుసా?

వియత్నాంలోని ఓ రెస్టారెంట్‌లో ఇండియన్ ఫ్యామిలీ వీరంగం, ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటూ బెదిరింపులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×