BigTV English

KTR: కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారిలా? మూసీ ప్రక్షాళనపై ‘మురుగు’ రాజకీయాలు, అసలు సంగతి ఇది

KTR: కేటీఆర్ అడ్డంగా దొరికిపోయారిలా? మూసీ ప్రక్షాళనపై ‘మురుగు’ రాజకీయాలు, అసలు సంగతి ఇది

KTR:  ఎదుటివాళ్ళకు ఒక వేలు చూపిస్తే.. మనవైపు నాలుగు వేళ్ళు చూపిస్తాయని తరచూ పెద్దలు చెప్పేమాట. ఈ మాట ఏమోగానీ, కేటీఆర్‌కి మాత్రం అతికినట్టు సరిపోతోంది. పదేళ్లలో తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేశామంటూ కారు పార్టీ నేతలు చిలక పలుకులు చెబుతున్నారు. ఇంతకీ అభివృద్ధి ఎక్కడ? ఏం చేసింది? మూసీ అభివృద్ధిపై ఎందుకు బురద జల్లుతోంది? ప్రజల ఆలోచనను డైవర్ట్ చేసే పనిలో ఆ పార్టీ పడిందా? బీఆర్ఎస్ నేతల మాటలకు.. పనులకు ఎందుకు పొంతన కుదిరిందా? లేదనే సమాధానాలు బలంగా వినిపిస్తున్నాయి.


పర్యావరణ వేత్తల హెచ్చరికలతో రేవంత్ సర్కార్ మూసీ నది సుందరీకరణపై ఫోకస్ చేసింది. దీనిపై బురద జల్లే ప్రయత్నం చేస్తోంది విపక్ష బీఆర్ఎస్. అసలు మూసీ సుందరీకరణ అవసరం లేదని, మొత్తమంతా తామే చేశామని చెబుతున్నారు. ఇంతకీ కేటీఆర్ చెబుతున్న మాటలు నమ్మవచ్చా? ఈ ప్రశ్న చాలామంది తెలంగాణ వాదులను వెంటాడుతోంది.

తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత  అభివృద్ధి చేసే అవకాశం తొలుత కారు పార్టీ వచ్చింది. దశాబ్దంపాటు ప్రజలు అవకాశం ఇచ్చారంటే ఆషామాసీ కాదు. తొలుత ప్రాజెక్టులన్నారు.. వాటి గురించి మీకు తెల్సిందే. తాజాగా హైదరాబాద్‌లో మురుగు నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను తామే కట్టామని, మూసీ నది ప్రక్షాళన అవసరమే లేదన్నది మాజీ మంత్రి కేటీఆర్ మాట.


హైదరాబాద్‌లో 31 ఎస్టీపీలు కట్టామని, రేవంత్ సర్కార్ మూసీ ప్రక్షాళన చేయాల్సిన అవసరం లేదంటున్నారు. గతేడాది సెప్టెంబర్ నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. అంతేకాదు హైదరాబాద్‌ను 100 శాతం మురుగు నీటిని శుద్ది చేసే సిటీగా మారుస్తామన్నారు. కానీ ఆయన మాటలు తేలిపోయాయి.

ALSO READ: మొదలైన మూసీ ప్రక్షాళన.. నిర్వాసితులకు శుభవార్త, పిల్లలు నష్టపోకుండా..

కేటీఆర్ చెప్పిన విషయాలను లోతుగా పరిశీలిస్తే.. బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయేనాటికి కేవలం నాలుగు ఎస్టీపీలు మాత్రమే పూర్తయ్యాయి. వాటిలో కోకాపేట్, దుర్గం చెరువు, పెద్ద చెరువు, నల్ల చెరువు వంటివి ఉన్నాయి. 27 ఎస్టీపీలను పెండింగ్ లో పెట్టేశారన్నమాట.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిలో ఆరింటిని పూర్తి చేసింది. నాగోల్, ఫతేనగర్, మీరాలం, ఖాజాకుంట, మియాపూర్, పటేల్ చెరువు ఎస్టీపీలు ప్రారంభానికి రెడీ అయ్యాయి. గడిచిన పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేంటి? ప్రతీ ఏడాదీ నగర జనాబా పెరుగుతోంది. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అభివృద్ధి అనేది నిత్యం జరుగుతున్న ప్రక్రియ మాత్రమే. ఈ లాజిక్‌ను మరిచిపోయారు మాజీ మంత్రి. ఎస్టీపీలపై డీటేల్ వీడియో మీకోసం.

 

Related News

Guvvala vs Ktr: కేటీఆర్‌పై గువ్వల కామెంట్స్.. తాను దిగితే ఆయన పనైపోయినట్టే

Hyderabad Rains: సాయంత్రం అయితే చాలు..ఒకటే కుమ్ముడు, మళ్లీ తడిచి ముద్దైన భాగ్యనగరం

Rakhi Festival: తమ్ముడికి రాఖీ కట్టేందుకు సాహసం చేసిన అక్క.. 20 అడుగుల ఎత్తున్న రైల్వే బ్రిడ్జి గోడపై నుంచి..?

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Big Stories

×