Maheshbabu :ఈ మధ్యకాలంలో భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు ఒకరి తర్వాత ఒకరు తమ వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇప్పుడు ఘట్టమనేని (Ghattamaneni ) కుటుంబం నుండి ఏకంగా 6 మందికి పైగా వారసులు ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. అలాంటి వారిలో ముందుగా వస్తున్న హీరో ఘట్టమనేని జయకృష్ణ (Ghattamaneni Jayakrishna). దివంగత నటుడు రమేష్ బాబు (Ramesh Babu) వారసుడు జయకృష్ణ.. తన బాబాయ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Maheshbabu ).ప్రోత్సాహంతో హీరోగా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మొదటి సినిమాకు సంబంధించిన పోస్టర్ ను రిలీజ్ చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
విషయంలోకి వెళ్తే దివంగత నటులు కృష్ణ మనవడు.. రమేష్ బాబు తనయుడు జయకృష్ణ ఘట్టమనేని హీరోగా నేడు సినిమాను ప్రకటించారు. సీనియర్ నిర్మాత, వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినీ దత్ సమర్పణలో పి. కిరణ్ నిర్మాణంలో “చందమామ కథలు పిక్చర్స్” అనే ఒక కొత్త నిర్మాణ సంస్థ ద్వారా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ఎక్స్ 100, మంగళవారం వంటి చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇకపోతే తాజాగా ఈ సినిమాని అనౌన్స్ చేస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా.. అందులో బ్యాక్ గ్రౌండ్ లో తిరుపతి విజువల్స్ ఉండడంతో సినిమా తిరుపతి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని స్పష్టం అవుతుంది.
మొత్తానికి అయితే ఘట్టమనేని కుటుంబం నుండి జయకృష్ణ ఘట్టమనేని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. మరి మహేష్ బాబుకి కొడుకు వరుసయ్యే జయకృష్ణ హీరోగా ఎలా ప్రేక్షకులను ఆకట్టుకుంటారో చూడాలి. ఇకపోతే ఈ సినిమాకు ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని.. త్వరలోనే దీనిపై కూడా అధికారిక ప్రకటన వెలబడునున్నట్లు తెలుస్తోంది.
also read:Bigg Boss 9 Promo: రీతూ చౌదరి టాలెంట్ అదుర్స్.. అంతమాట అన్నారేంటి సార్!
జయకృష్ణ తండ్రి రమేష్ బాబు విషయానికి వస్తే.. గతంలో పలు చిత్రాలలో హీరోగా నటించారు. 1965 అక్టోబర్ 13న చెన్నైలో కృష్ణ, ఇందిరా దంపతులకు జన్మించిన ఈయన.. 1974లో అల్లూరి సీతారామరాజు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించి ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఆ తర్వాత సామ్రాట్ సినిమాతో హీరోగా పరిచయమైన రమేష్ బాబు.. చిన్ని కృష్ణుడు, బజారు రౌడీ, కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, కృష్ణ గారి అబ్బాయి, ఆయుధం, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు , నా ఇల్లే నా స్వర్గం, మామ కోడలు, అన్నా చెల్లెలు, పచ్చతోరణం లాంటి చిత్రాలు చేశారు.
చివరిగా 1977లో ఎన్కౌంటర్ అనే సినిమాలో నటించిన రమేష్ బాబు.. 1999 నుంచి నిర్మాతగా పలు చిత్రాలు నిర్మించారు. అలా సూర్యవంశం, అర్జున్, అతిథి , దూకుడు వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించిన రమేష్ బాబు 2022 జనవరి 8న కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతూ తుది శ్వాస విడిచారు
With a Great Story comes Greater Responsibility…
Thrilled and honoured to introduce #JayaKrishnaGhattamaneni through my next film 😇🤩
From the heart of the hills, a raw, intense and realistic love story, #AB4 Title announcement soon❤️🔥
Presented by @AshwiniDuttCh
Produced by… pic.twitter.com/Fmn2AoYeEU— Ajay Bhupathi (@DirAjayBhupathi) November 9, 2025