Siva Re Release:మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).. టాలీవుడ్ లో గొప్ప మనసున్న వ్యక్తిగా పేరు సొంతం చేసుకున్నారు అనడంలో సందేహం లేదు. ఒకవైపు తన నటనతోనే కాదు మరొకవైపు తన తోటి నటీనటులతో ఎలా నడుచుకోవాలో తెలిసిన వ్యక్తి అని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైంది. గతంలో తనను టార్గెట్ చేసిన వారిని కూడా ప్రశంసిస్తూ చిరంజీవి చేస్తున్న పోస్టులు అటువైపు వారికి పశ్చాతాపడేలా చేస్తున్నాయి అనడంలో సందేహం లేదు. ఈ క్రమంలోనే గతంలో చిరంజీవి టార్గెట్ చేస్తూ వర్మ చేసిన కామెంట్లకు ఇప్పుడు చిరంజీవి చేసిన కామెంట్లను దృష్టిలో పెట్టుకొని వర్మ క్షమాపణలు కోరారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో మాఫియా నేపథ్యంలో రాంగోపాల్ వర్మ (Ram Gopal Varma)దర్శకత్వంలో నాగార్జున(Nagarjuna ), అమల (Amala ) జంటగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం శివ. ఈ సినిమా అప్పట్లో ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది. అయితే 36 ఏళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ కి సిద్ధమవుతుండడంతో అభిమానులు తెగ ఎగ్జైట్ గా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా నాటి జనరేషన్ యువత మాత్రమే కాకుండా ఈ తరం యువత కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మెగాస్టార్ చిరంజీవి ఒక చిన్న వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు.
also read:OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?
అందులో చిరంజీవి మాట్లాడుతూ..శివ సినిమా చూసిన తర్వాత నేను పూర్తిగా ఆశ్చర్యపోయాను, అది సినిమా కాదు ఒక విప్లవం. ఒక ట్రెండ్ సెట్టర్. తెలుగు సినిమాకు కొత్త నిర్వచనాన్ని తీసుకువచ్చి,కొత్త ఒరవడికి నాంది పలికింది శివ సినిమా. ఇప్పటికీ శివ సినిమాలోని ఒక సీన్ మర్చిపోలేను. కల్ట్ షాట్ వంటిది. అదే నాగార్జున సైకిల్ చైన్ లాగే సీన్ హైలెట్. నాగార్జున తన నటనలోని అత్యధిక తీవ్రత, ఆ చూపులలో దీక్షిత, నటనలో ఉన్న కంపోజ్ ఫెంటాస్టిక్.అమలా గారి నటన కూడా అద్భుతంగా ఉంది.
విలన్ పాత్రలో రఘువరన్ కూడా అద్భుతంగా నటించారు.ఇలా ఈ సినిమాలో ప్రతి ఒక్కరు కూడా ఫ్రేమ్ కి ప్రాణం పోసి నటించారు. మళ్లీ శివ ఈ డిజిటల్ ఎరలో విడుదల కాబోతోందని తెలిసి నిజంగా చాలా చక్కటి ప్రయత్నం అనిపించింది. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న యువతరానికి ఈ సినిమా గురించి తెలియాలి..ఈ సినిమా ఎలా తీశారు అనే విషయం తెలుసుకోవాలి.. ఈ సినిమా తెరకెక్కించిన తీరు గురించి మాట్లాడుకోవాలి.. ముఖ్యంగా వర్మ గురించి.. ఆయన విజన్ , ఆ కెమెరా లోని యాంగిల్స్, సినిమాని ప్రజెంటేషన్ చేసిన తీరు అద్భుతంగా ఉంది. ఆరోజు అనిపించింది ఈ యువ దర్శకుడు తెలుగు సినిమా భవిష్యత్తు అంటూ వర్మ ను పొగిడేశారు.
అయితే వర్మ ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ.. చిరంజీవికి ధన్యవాదాలు చెబుతూనే.. క్షమాపణలు కూడా తెలిపారు. అయితే ఎందుకు క్షమాపణలు చెబుతున్నారు అనే విషయాన్ని మాత్రం చెప్పలేదు. ప్రస్తుతం వర్మ చిరంజీవికి క్షమాపణలు చెప్పడంతో ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
అసలు విషయంలోకి వెళ్తే రాంగోపాల్ వర్మ బాలీవుడ్ కి వెళ్ళిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మౌత్ పీస్ గా మారి టిడిపి , జనసేన పార్టీలపై విమర్శలు గుప్పించారు. 2024 ఎన్నికలలో వైసీపీ పరాజయం పొందిన తరువాత వర్మలో మార్పు వచ్చింది. అందుకే రాజకీయాలకు దూరంగా సినిమాలపై ఫోకస్ పెట్టారు. అయితే రాజకీయాల్లో ఉన్నప్పుడు చిరంజీవిని కూడా వదల్లేదు వర్మ. ఇక వైసీపీతో అంటగాగుతూ చిరును టార్గెట్ చేయడం పై ఇప్పుడు వర్మ పశ్చాతాపం చెందుతున్నాడు అనేది తెలుస్తోంది. చిరంజీవి మాత్రం అవేవీ పట్టించుకోకుండా శివ రీ రిలీజ్ నేపథ్యంలో దర్శకుడుని పొగడడంతో చిరు గొప్పతనానికి ఇది నిదర్శనం అని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు.
Thank you @KChiruTweets gaaru, Also on this occasion I want to sincerely apologise to you if I ever unintentionally offended you ..Thank you once again for your large heartedness 🙏🙏🙏 pic.twitter.com/08EaUPVCQT
— Ram Gopal Varma (@RGVzoomin) November 9, 2025