Pawan Kalyan: సినీ నటుడు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గత కొంతకాలంగా రాజకీయ వ్యవహారాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో సినిమాలను పూర్తిగా తగ్గించారు. అయితే ఇప్పుడు మాత్రం ఒక వైపు రాజకీయ కార్యకలాపాలను నిర్వహిస్తూనే మరోవైపు సినిమాలను కూడా వరుసగా లైన్ లో పెడుతున్న నేపథ్యంలో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ తాజాగా డైరెక్టర్ సుజిత్(Sujith) దర్శకత్వంలో తెరకెక్కిన ఓజి సినిమా(OG Movie) ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలనాలను సృష్టించింది. ఇక ఈ సినిమాకు మంచి ఆదరణ వచ్చిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఓజి యూనివర్స్ గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ యూనివర్స్ నుంచి సీక్వెల్ సినిమాతో పాటు ప్రీక్వెల్ సినిమా కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలిపారు.
తాజాగా పవన్ కళ్యాణ్ కి సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ హీరోగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు మరో సినిమా చేయటానికి ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. దిల్ రాజు నిర్మాణంలో పవన్ కళ్యాణ్ చివరిగా వకీల్ సాబ్ సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. వకీల్ సాబ్ సినిమా తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు పవన్ కళ్యాణ్ తో మరో సినిమా చేయాలని చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.
ఇక ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వం వహించబోతున్నట్టు తెలుస్తుంది. అనిల్ రావిపూడి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈయన డైరెక్షన్ లో వచ్చిన ఏ ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను నిరాశపరచలేదు. ఈ నేపథ్యంలోనే దిల్ రాజు అనిల్ రావిపూడి దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ తో సినిమా చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ కాంబినేషన్ కనుక సెట్ అయితే పవన్ కళ్యాణ్ కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ ఖాయమని స్పష్టం అవుతుంది.
మాకోసం ఏడాదికి ఒక సినిమా..
ఇక ప్రస్తుతం అనిల్ రావిపూడి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేస్తున్న సంగతి తెలిసింది. వీరిద్దరి కాంబినేషన్ లో మన శంకర వరప్రసాద్ గారు అనే సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది దాదాపు ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తి కావచ్చాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్న సంగతి తెలిసిందే. మరి అనిల్ రావిపూడి పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో సినిమా రాబోతోంది అంటూ వస్తున్న ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనేది తెలియాలి అంటే దిల్ రాజు స్పందించాల్సి ఉంది. ఇటీవల దిల్ రాజు ఓజి సినిమా సక్సెస్ ఈవెంట్ లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలలో ఎంత బిజీగా ఉన్నా మా కోసం ఏడాదికి ఒక సినిమా చేయాలి అంటూ రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.
Also Read: Vijay Devarakonda: బ్రేకింగ్ – విజయ్ దేవరకొండ కారుకు ప్రమాదం