OTT Movie : సోషల్ మెసేజ్ తో దర్శకులు కొన్ని అద్భుతమైన సినిమాలను తెరకెక్కిస్తుంటారు. అవినీతితో కూడిన సంఘటనలు, మహిళలు ఎదుర్కునే సమస్యలతో ఎన్నో సినిమాలు వచ్చాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా, ప్రకృతిని నిర్లక్ష్యం చేస్తే జరిగే దారుణమైన సంఘటనలను చూపిస్తుంది. హాలీవుడ్ ప్రముఖ దర్శకుడు M. నైట్ ష్యామలాన్ రూపొందించిన ఈసినిమా, బాక్స్ ఆఫీస్ లో బంపర్ హిట్ అయింది. ఈ కథలో చెట్లు ఒక టాక్సిన్ ని రిలీజ్ చేయడంతో, మనుషులు సూ సైడ్ చేసుకుని చచ్చిపోతుంటారు. ఈసినిమా క్లైమాక్స్ వరకు అద్భుతంగా ఉంటుంది. దీని పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ది హ్యాపెనింగ్’ (The happening) 2008లో వచ్చిన అమెరికన్ సై-ఫై థ్రిల్లర్ సినిమా. M. నైట్ ష్యామలాన్ దీనికి దర్శకత్వం వహించారు. ఇందులో ఎలియట్ మూర్ (మార్క్ వాల్‌బర్గ్), అల్మా (జూయీ డెషానెల్), జెస్ (ఆష్లీ రోస్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2008 జూన్ 13న రిలీజ్ అయ్యింది. 1 గంట 31 నిమిషాల నిడివితో IMDbలో 5.0/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.
అమెరికాలోని ఫిలడెల్ఫియాలో, ఎలియట్ ఒక సైన్స్ టీచర్ గా ఉద్యోగం చేస్తుంటాడు. అతని గర్ల్‌ఫ్రెండ్ అల్మాతో, అతనికి కొన్ని రిలేషన్‌షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక రోజు సిటీలో ఉండే ఒక సెంట్రల్ పార్క్‌లో విచిత్రమైన సంఘటన జరుగుతుంది. మనుషులు ఒక్కసారిగా ఆగిపోయి, తమను తాము చంపుకుంటారు. కొందరు బిల్డింగ్‌ల నుంచి దూకుతారు, కొందరు తమను తాము హర్ట్ చేసుకుంటారు. ఈ సంఘటన నగరమంతా వ్యాపిస్తుంది. ఎలియట్, అల్మా, ఎలియట్ ఫ్రెండ్ జోయ్, జోయ్ కూతురు జెస్ కలిసి, ఒక సేఫ్ ప్లేస్ కోసం ట్రై చేస్తారు. వాళ్లు పెన్సిల్వేనియాలోని ఒక రూరల్ ఏరియాకు వెళ్తారు. అక్కడ వీళ్ళంతా సేఫ్ అని అనుకుంటారు.
ఈ మరణాలకు కారణం ఏంటో తెలీదు, కానీ ఎలియట్ గెస్ చేస్తాడు.
చెట్లు ఒక టాక్సిన్ రిలీజ్ చేస్తున్నాయని, అది మనుషులను సూసైడ్ చేసుకునేలా ప్రేరేపిస్తోందని తెలుస్తుంది. ఎక్కువ మనుషులు ఉన్న ప్లేస్‌లో ఈ టాక్సిన్ ఎక్కువగా పనిచేస్తుంటుంది. ఈ సమయంలో ఎలియట్ గ్రూప్ రోడ్డుపై ఎస్కేప్ అవుతూ, ఇతర సర్వైవర్స్‌ను కలుస్తారు. వాళ్లు ఒక ఓల్డ్ లేడీ జూలియా ఇంటికి వెళ్తారు. మనం ప్రకృతిని డ్యామేజ్ చేసినందుకు, ప్రకృతి మనపై రివెంజ్ తీర్చుకుంటోందని జూలియా చెబుతుండగానే, ఆమె కూడా ఈ టాక్సిన్ వల్ల చనిపోతుంది. ఎలియట్, అల్మా, జెస్ ఇంకా పారిపోతూ సేఫ్ ప్లేస్ వెతుకుతారు. ఒక రూరల్ ఏరియాలో వీళ్ళు సేఫ్ ప్లేస్ ను కనుక్కుంటారు. అక్కడికి వెళ్ళాక ఈ టాక్సిన్ ఎఫెక్ట్ తగ్గిపోతుంది. వాళ్లు బతికి బయట పడతారు. అయితే అనూహ్యంగా ఈ సంఘటన మళ్లీ వేరే నగరంలో స్టార్ట్ అవుతుంది. ప్రకృతిని మనుషులు డ్యామేజ్ చేస్తే ఏం జరుగుతుందో, ఈ సినిమా కళ్ళకు కట్టినట్లు చూపిస్తుంది.
Read Also : అందమైన అమ్మాయి ఒంట్లో దెయ్యం… రాత్రయితే వణికిపోయే ప్రియుడు… ఓటిటిలో సరికొత్త స్టోరీ