RRC: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.. రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. టెన్త్, ఐటీఐ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. అర్హత ఉంటే వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి విద్యార్హత, పోస్టులు, వెకెన్సీలు, దరఖాస్తు విధానం, జీతం, వయస్సు తదితర వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
రాజస్థాన్ రాష్ట్రం, జైపూర్ లోని రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ (ఆర్‌ఆర్‌సీ), నార్త్ వెస్ట్రన్ రైల్వే ఎన్‌డబ్ల్యూఆర్ పరిధిలోని వర్క్‌షాప్, యూనిట్‌లలో 2,094 యాక్ట్ అప్రెంటిస్ శిక్షణ కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం వెకెన్సీల సంఖ్య: 2094
రైల్వే రిక్రూట్ మెంట్ సెల్ వివిధ వర్క్ షాప్ లలో ఈ పోస్టులను భర్తీ చేస్తోంది. డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (అజ్‌మేర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (బికనీర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జైపూర్), డివిజనల్ రైల్వే మేనేజర్ ఆఫీస్ (జోధ్‌పూర్), బీటీసీ క్యారేజ్ (అజ్మీర్), బీటీసీ లోకో (అజ్మీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (బికనీర్), క్యారేజ్ వర్క్స్ షాప్ (జోధ్‌పుర్) వర్క్ షాపుల్లో శిక్షణ ఉంటుంది.
ఎలక్ట్రికల్, కార్పెంటర్, పెయింటర్, మేసన్, పైప్ ఫిట్టర్, ఫిట్టర్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, వెల్డర్, మెకానికల్, డీజిల్ మెకానికల్, ఎలక్ట్రీషియన్, మెషినిస్ట్ ట్రేడుల్లో పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వివరాలు
యాక్ట్ అప్రెంటీస్: 2094 పోస్టులు
విద్యార్హత: కనీసం 50 శాతం మార్కులతో టెన్త్ క్లాస్ తో పాటు సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ పాసై ఉండాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 2
వయస్సు: 2025 నవంబర్ 2 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: మెట్రిక్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.100 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
నోటిఫికేషన్ కీలక సమాచారం:
మొత్తం పోస్టుల సంఖ్య: 2094
దరఖాస్తుకు చివరి తేది: 2025 నవంబర్ 2
ALSO READ: RRB NTPC: రైల్వేలో 8850 ఎన్టీపీసీ పోస్టులు.. ఈ జాబ్ వస్తే గోల్డెన్ లైఫ్.. ఇంటర్, డిగ్రీ పాసైతే చాలు