BigTV English

Pushpa 2 Movie Twitter Review Live Updates: ‘పుష్ప 2’ మూవీ ట్విట్టర్ రివ్యూ లైవ్ అప్డేట్స్

Pushpa 2 Movie Twitter Review Live Updates: ‘పుష్ప 2’ మూవీ ట్విట్టర్ రివ్యూ లైవ్ అప్డేట్స్

Pushpa 2 Movie Twitter Review: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పుష్ప 2’ ఎన్నో భారీ అంచనాల మధ్య విడుదలయ్యింది. ఈ సినిమా ఎలా ఉన్నా నెగిటివ్ చేయాలని మెగా ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. అయినా టికెట్ ధరలు పెరగడం కూడా పట్టించుకోకుండా చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ‘పుష్ప 2’ ప్రీమియర్ షో టికెట్లు కొనుగోలు చేశారు. వాళ్లంతా సినిమా చూసి ట్విటర్‌లో రివ్యూలు ఇస్తున్నారు.


ఒకవైపు ‘పుష్ప 2’లో అల్లు అర్జున్ ఎంట్రీ సీన్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యి చాలామంది బాగుంది అంటూంటే ఒకరు మాత్రం అసలు అది ఎంట్రీనేనా, అందులో మ్యూజిక్ అస్సలు బాలేదు అంటూ రివ్యూ ఇచ్చారు.

సీన్స్ మాత్రమే కాదు.. ‘పుష్ప 2’లోని డైలాగ్స్ కూడా అప్పుడే సోషల్ మీడియాలో ట్రెండ్ అవ్వడం మొదలయ్యింది.

అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంతా జాతర సీన్ కోసమే ఎదురుచూస్తుంటే సౌదీ అరేబియాలో ఉన్న ప్రేక్షకులకు మాత్రం ఆ సీన్ చూసే అవకాశం లేకుండా 19 నిమిషాలు ట్రిమ్ చేశారు.

కొందరు ప్రేక్షకులు అయితే ‘పుష్ప 2’ను పార్ట్ 1తో పోలుస్తూ పార్ట్ 1 బాగుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

 

అల్లు అర్జున్, రష్మిక కలిసి స్టెప్పులేసిన ‘పీలింగ్స్’ పాట ఇప్పటికే సోషల్ మీడియాలో రచ్చ చేయగా.. థియేటర్లు కూడా ఈ పాటకు బ్లాస్ట్ అయ్యాయని ప్రేక్షకులు అంటున్నారు.

‘పుష్ప 2’ ప్రీమియర్ షో చూడాలని చాలామంది అల్లు అర్జున్ ఫ్యాన్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ వద్దకు చేరుకున్నారు. అక్కడ జరిగిన తొక్కిసలాటలో బాలుడు స్పృహ కోల్పోయాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమం అని తెలుస్తోంది.

 

‘పుష్ప 2’లో అల్లు అర్జున్, రష్మిక కెమిస్ట్రీ బాగుంటుందని కొందరు అనుకుంటుంటే అస్సలు బాలేదని కామెంట్స్ చేస్తున్నారు మరికొందరు.

చాలా తక్కువమంది ప్రేక్షకులు మాత్రమే ‘పుష్ప 2’ ఎలా ఉంది అనేదానిపై స్పష్టమైన రివ్యూ అందించారు.

 

‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ చాలా బాగుందని కొందరు అంటుంటే.. లేదు, అస్సలు బాలేదు అని మరికొందరు అంటున్నారు.

‘పుష్ప 2’ చూసిన ప్రేక్షకులు తమకు ఏయే సీన్స్ నచ్చాయో కూడా ప్రత్యేకంగా చెప్తున్నారు.

‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్‌కు అటు పాజిటివ్, ఇటు నెగిటివ్ కాకుండా మిక్స్‌డ్ రివ్యూలు కూడా వస్తున్నాయి.

‘పుష్ప 2’ సినిమా చూసిన తర్వాత ప్రముఖ రివ్యూవర్ తరణ్ అదర్శ.. ఈ మూవీపై డీటైల్డ్ రివ్యూను తన ట్విటర్‌లో పోస్ట్ చేశారు.

ఒక మంచి సీక్వెల్‌ను తెరకెక్కించే ఛాన్స్ ఉన్నా దానిని వేస్ట్ చేశారని, రూ.500 కోట్ల బడ్జెట్ వేస్ట్ అయిపోయింది అంటూ ఒక ప్రేక్షకుడు అభిప్రాయం వ్యక్తం చేశాడు.

‘పుష్ప 2’ పూర్తయ్యే సమయానికి డీటైల్డ్ రివ్యూలు బయటికొస్తున్నాయి. అందులో చాలావరకు పాజిటివ్ రివ్యూలు ఉన్నాయి.

కొందరు ప్రేక్షకులు ‘పుష్ప 2’లో రష్మిక మందనా క్యారెక్టర్.. కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ పాత్రకు ఉండే ప్రాముఖ్యత వరకే పరిమితమయ్యింది అని చెప్తున్నా కూడా తన క్యారెక్టర్‌ను ప్రత్యేకంగా ప్రశంసిస్తున్నారు.

‘పుష్ప 2’ నుండి అల్లు అర్జున్ డిఫరెంట్ గెటప్‌లో ఉన్న పోస్టర్ విడుదలయినప్పటి నుండి జాతర సీన్ గురించి ప్రేక్షకులంతా మాట్లాడుకుంటున్నారు. ఆ సీన్‌లో అల్లు అర్జున్ యాక్టింగ్ వేరే లెవెల్ అని సినిమా చూసిన ఆడియన్స్ ప్రశంసిస్తున్నారు.

‘పుష్ప 2’ ఫస్ట్ హాఫ్ యావరేజ్‌గా ఉన్నా సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుందని చాలామంది ప్రేక్షకులు 3 కంటే ఎక్కువ రేటింగ్ ఇచ్చి సినిమాను సూపర్ హిట్ కేటగిరిలో చేరుస్తున్నారు.

‘పుష్ప 2’ నుండి అన్నింటి కంటే ముందుగా విడుదలయిన డ్యూయెట్ సాంగ్.. సూసేకి. ఈ పాట వీడియోలను షేర్ చేస్తూ సినిమా చాలా బాగుందంటున్నారు ప్రేక్షకులు.

‘పుష్ప 2’ సినిమాలో అల్లు అర్జున్, సుకుమార్ కష్టం ప్రతీ క్షణం కనిపిస్తూనే ఉందంటున్నారు ప్రేక్షకులు.

‘పుష్ప 2’ జాతర సీక్వెన్స్ చూసి ఫ్యాన్స్ ఎంజాయ్ చేయడంతో వారితో పాటు థియేటర్‌లో సినిమా చూస్తున్న అల్లు అర్జున్ చాలా హ్యాపీగా ఫీలయ్యాడు.

‘పుష్ప 2’ మూవీ చూసిన తర్వాత చాలావరకు ప్రేక్షకులు సినిమా బ్లాక్‌బస్టర్ అని రివ్యూ ఇచ్చేస్తున్నారు.

‘పుష్ఫ 2’ నుండి ‘కిసిక్’ పాట విడుదలయిన తర్వాత దానికి మిక్స్‌డ్ రెస్పాన్స్ వచ్చింది. కానీ సినిమా చూసిన తర్వాత పాటలో శ్రీలీల అందానికి ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.

కొందరు ప్రేక్షకులు తమకు సినిమా బ్లాక్‌బస్టర్ అనిపించింది అంటుంటే కొందరు మాత్రం తమకు యావరేజ్ అనిపించింది అంటూ రివ్యూలు ఇస్తున్నారు.

‘పుష్ప 2’లో గంగమ్మ తల్లి జాతర సీన్, అందులో అల్లు అర్జున్ యాక్టింగ్.. చాలాకాలం పాటు తెలుగు సినీ చరిత్రలో నిలిచిపోతుందని ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×