BigTV English

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : శవాలపై సైన్…ఈ కిల్లర్ మర్డర్స్ అరాచకం… క్షణక్షణం ఉత్కంఠ… గ్రిప్పింగ్ క్రైమ్ థ్రిల్లర్

OTT Movie : సీరియల్ కిల్లర్ స్టోరీలు, థ్రిల్లింగ్ తో పాటు భయాన్ని కూడా ఇస్తుంటాయి. ఈ సినిమాలలో కిల్లర్ సృష్టించే అరాచకాలకు నిద్ర పట్టడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇక ఈ సినిమాలు క్లైమాక్స్ వరకు ఉత్కంఠంగా నడుస్తూ, నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే ఇంటెన్స్ ని క్రియేట్ చేస్తుంటాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా,మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత వియన్నాలో జరిగే వరుస హత్యల చుట్టూ తిరుగుతుంది. ఇక్కడ కొంతమంది సైనికులను ఒక కిల్లర్ దారుణంగా చంపుతుంటాడు. కిల్లర్ ని పట్టుకునే క్రమంలో కథ చిల్లింగ్ థ్రిల్ ని ఇస్తుంది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాల్లోకి వెళ్తే …


ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘హింటర్‌ ల్యాండ్’ (Hinterland) 2021లో వచ్చిన ఆస్ట్రియన్ క్రైమ్ థ్రిల్లర్ సినిమా. దీనికి స్టెఫాన్ రుజోవిట్స్కీ దర్శకత్వం వహించారు. ఇందులో పీటర్ పెర్గ్ (మురతాన్ ముస్లు), థెరెసా (లివ్ లిసా ఫ్రీస్) ప్రధాన పాత్రల్లో నటించారు ఈ సినిమా 2021 అక్టోబర్ 7న రిలీజ్ అయ్యింది. 1 గంట 38 నిమిషాలతో ఇది IMDbలో 6.2/10 రేటింగ్ పొందింది. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ సినిమా స్ట్రీమింగ్‌లో ఉంది

స్టోరీ ఏమిటంటే

ఈ కథ 1920లో ఆస్ట్రియాలో స్టార్ట్ అవుతుంది. పీటర్ పెర్గ్ అనే వ్యక్తి ,మొదటి ప్రపంచ యుద్ధం నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. కానీ ఆస్ట్రియా పూర్తిగా మారిపోయింది. జనం ఉద్యోగాలు లేక అల్లాడుతుంటారు. రాజకీయం గందరగోళంలో ఉంటుంది. పీటర్ ఇంటికి వచ్చినప్పుడు, తనతో యుద్ధంలో బందీలుగా ఉన్న స్నేహితులు ఒక్కొక్కరూ దారుణంగా చంపబడ్డారని తెలుస్తుంది. వీళ్ళ శవాలపై కిల్లర్ ఒక సంతకం కూడా వదిలి వెళ్తుంటాడు. పీటర్ ఒకప్పుడు పోలీసు డిటెక్టివ్‌గా పనిచేసినవాడు. ఇప్పుడు తన స్నేహితులను చంపిన ఆ సీరియల్ కిల్లర్‌ను పట్టుకోవాలని డిసైడ్ అవుతాడు.


ఇక పీటర్ కిల్లర్‌ను వెతకడం స్టార్ట్ చేస్తాడు. అతనికి థెరెసా అనే ఫోరెన్సిక్ డాక్టర్ హెల్ప్ చేస్తుంది. థెరెసా కూల్, స్మార్ట్ అమ్మాయి. వాళ్లు మర్డర్ సీన్స్ చూస్తే, కిల్లర్స్ చాలా దారుణమైన వాళ్ళుగా ఉంటారని తెలుస్తుంది. ఈ ఇన్వెస్టిగేషన్ వియన్నా డార్క్ ఏరియాస్‌కు తీసుకెళ్తుంది. అక్కడ పొలిటికల్ గొడవలు, జనం కష్టాలు, అల్లర్లు ఉంటాయి. పీటర్, థెరెసా మధ్య చిన్న రొమాన్స్ ఫీలింగ్ మొదలవుతుంది. వాళ్లు కిల్లర్‌ను పట్టుకోవడానికి చాలా క్లూస్ వెతుకుతారు, కానీ కిల్లర్ చాలా తెలివిగా ఎస్కేప్ అవుతూ ఉంటాడు.

కథ ముందుకు వెళ్తున్న కొద్దీ పీటర్ కిల్లర్ ఎవరో కనిపెడతాడు. కిల్లర్ యుద్ధంలో జరిగిన ఒక సంఘటన వల్ల, రివెంజ్ తీర్చుకుంటున్నాడని తెలుస్తుంది. కిల్లర్ ని పట్టుకోవడానికి పీటర్ ప్రాణాలకు తెగించి పోరాడతాడు. చివరికి కిల్లర్ ని పీటర్ పట్టుకుంటాడా ? ఈ ఇన్వెస్టిగేషన్‌లో ఎలాంటి రహస్యాలు వెలుగులోకి తెస్తాడు ? థెరెసాతో అతని రొమాన్స్ డెవలప్ అవుతుందా ? అనే విషయాలను, ఈ ఇంటెన్స్ థ్రిల్లర్ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.

Read Also : మొదటి రాత్రే పెళ్ళానికి షాక్… భర్తకు మ్యాటర్ వీక్… కడుపుబ్బా నవ్వించే బ్లాక్ కామెడీ మూవీ

Related News

OTT Movie : తమ్ముడి ముందే అక్కను దారుణంగా… మేనల్లుడి రివేంజ్ కి గూస్ బంప్స్ … క్లైమాక్స్ అరాచకం

OTT Movie : బిజినెస్ పేరుతో భర్త పత్తాపారం… మరో అమ్మాయిపై మోజుతో పాడు పని… కట్ చేస్తే తుక్కురేగ్గొట్టే ట్విస్ట్

OTT Movie : ఇదేం సినిమా గురూ… మనుషులపై పగబట్టి మారణకాండ సృష్టించే గాలి… మతిపోగోట్టే సై-ఫై థ్రిల్లర్

OTT Movie : ఏం సినిమా మావా… ఇద్దరు పిల్లలున్న తల్లి ఇంట్లోకి ముగ్గురు పనోళ్ళు… ఒక్కో సీన్ కు గూస్ బంప్స్ పక్కా

OG OTT: నెల రోజుల్లోనే ఓటీటీకి వస్తున్న ఓజీ.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే!

This week OTT Movies : ఈ వారం ఓటీటీలోకి బ్లాక్ బాస్టర్ చిత్రాలు.. ఆ రెండే ఇంట్రెస్టింగ్..

OTT Movie : టాక్సిక్ బాయ్ ఫ్రెండ్, యాటిట్యూడ్ కు బాప్ ఆ అమ్మాయి… రా అండ్ ఎమోషనల్ లవ్ స్టోరీ

Big Stories

×