Nazriya Nazim Latest Photos: కొందరు హీరోయిన్లు మన భాషలో నేరుగా సినిమాలు చేయకపోయినా.. తరచుగా వెండితెరపై కనిపించకపోయినా వారి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గదు. అలాంటి హీరోయిన్స్‌లో నజ్రియా నాజిమ్ ఒకరు. (Image Source: Nazriya Nazim/Instagram)
2013లో విడుదలయిన ‘రాజా రాణి’ సినిమాతో తమిళం మాత్రమే కాదు.. తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది నజ్రియా నాజిమ్. (Image Source: Nazriya Nazim/Instagram)
2022లో విడుదలయిన ‘అంటే సుందరానికీ’ అనే సినిమాకు ముందు నజ్రియా అసలు తెలుగులో ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ ‘రాజా రాణి’ వల్ల ఎనలేని ఫ్యాన్ బేస్ మాత్రం వచ్చింది. (Image Source: Nazriya Nazim/Instagram)
నజ్రియాకు ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా.. ఎన్ని మంచి స్క్రిప్ట్స్ తన దగ్గరకు వచ్చినా ఫాహద్‌తో పెళ్లి తర్వాత తను సినిమాలు చాలావరకు తగ్గించేసింది. (Image Source: Nazriya Nazim/Instagram)
గత కొన్నేళ్లుగా మాలీవుడ్‌లో పరిస్థితి ఎలా ఉందంటే.. నజ్రియా ఒక సినిమాలో నటించిందంటే కచ్చితంగా దాని కథ బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది అని ప్రేక్షకులు ఫిక్స్ అయిపోతున్నారు. (Image Source: Nazriya Nazim/Instagram)
నజ్రియా నాజిమ్ చివరిగా నటించిన ‘అంటే సుందరానికీ’ విడుదలయ్యి రెండేళ్లు అవుతున్నా ఇప్పటికీ తన నుండి ఇంకొక సినిమా రాలేదు. తాజాగా తన అప్‌కమింగ్ మూవీ గురించి పెద్ద అనౌన్స్‌మెంటే వచ్చింది. (Image Source: Nazriya Nazim/Instagram)
బాసిల్ జోసెఫ్‌తో కలిసి ‘సూక్ష్మదర్శిని’ అనే మూవీలో నటించింది నజ్రియా నాజిమ్. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్స్ కోసం కష్టపడుతోంది ఈ భామ. (Image Source: Nazriya Nazim/Instagram)
‘సూక్ష్మదర్శిని’ ప్రమోషన్స్ కోసం నజ్రియా నాజిమ్ అప్లోడ్ చేసిన ఫోటోలు తన ఫాలోవర్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. (Image Source: Nazriya Nazim/Instagram)