Rashi Singh Latest Photos: కొందరు హీరోయిన్లు వెండితెరపై ఎంత టాలెంట్ చూపించినా వారికి లక్ మాత్రం కలిసిరాదు. అందుకే వారు సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌ను అట్రాక్ట్ చేసే ప్రయత్నాలు మొదలుపెడతారు. ఇప్పుడు రాశి సింగ్ కూడా అదే రూట్ ఫాలో అవుతోంది. (Image Source: Rashi Singh/Instagram)
క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ముద్దుగుమ్మలకు హీరోయిన్స్‌గా అవకాశాలు రావడం చాలా అరుదు. అలాంటి అరుదైన అదృష్టం రాశి సింగ్‌కు దక్కింది. (Image Source: Rashi Singh/Instagram)
ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా ప్రేక్షకుల దృష్టిలో పడే ప్రయత్నం చేసింది రాశి సింగ్. (Image Source: Rashi Singh/Instagram)
అలా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తర్వాత ‘ప్రేమ్ కుమార్’ అనే మూవీలో సెకండ్ హీరోయిన్‌గా నటించే అవకాశం రాశి సింగ్‌కు దక్కింది. (Image Source: Rashi Singh/Instagram)
ఆ తర్వాత శివ్ కందుకూరి హీరోగా నటించిన ‘భూతద్దం భాస్కర నారాయణ’తో రాశి సింగ్ అనే హీరోయిన్ ఉందని చాలామంది ప్రేక్షకులకు తెలిసింది. (Image Source: Rashi Singh/Instagram)
‘భూతద్దం భాస్కర నారాయణ’ సినిమాలో హీరోతో సరిపడా ప్రాముఖ్యత ఉండే పాత్రలో నటించింది రాశి సింగ్. (Image Source: Rashi Singh/Instagram)
‘భూతద్దం భాస్కర నారాయణ’ తర్వాత రాశి సింగ్‌కు హీరోయిన్‌గా కాకుండా ఏకంగా విలన్‌గానే నటించే అవకాశం దక్కింది. (Image Source: Rashi Singh/Instagram)
సుహాస్ హీరోగా తెరకెక్కిన ‘ప్రసన్నవదనం’ మూవీలో విలన్‌గా నటించి మెప్పించిన రాశి సింగ్.. ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియా పోస్టులతో కుర్రకారును ఫిదా చేస్తోంది. (Image Source: Rashi Singh/Instagram)