Kiran Royal vs Roja: మాజీ మంత్రి రోజాకు కష్టాలు తప్పవా.. విచారణ ఎదుర్కోవాల్సిందేనా.. టూరిజం స్కామ్ లో సీఐడీ విచారణ సాగే అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. రోజా భవిష్యత్ ఏంటి అంటే.. నగరి జైలుకే పంపిస్తాం అంటున్నారు తిరుపతికి చెందిన జనసేన పార్టీ ఇంచార్జ్ కిరణ్ రాయల్.
గత ప్రభుత్వ హయాంలో టూరిజం స్కామ్ ద్వారా శ్రీవారి దర్శన టికెట్లకు సంబంధించి అవకతవకలు జరిగాయని ఇప్పటికే కూటమి నేతలు విమర్శల పర్వం సాగిస్తున్నారు. అలాగే ఇటీవల జరిగిన టిటిడి పాలకమండలి సమావేశంలో సైతం స్వయంగా చైర్మన్ బీఆర్ నాయుడు మాట్లాడుతూ.. టూరిజం శ్రీవారి దర్శనం టికెట్లలో అవకతవకలు జరిగినట్లు తమ దృష్టికి వచ్చిందని, అందుకు టూరిజం టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.
అయితే తిరుపతిలో నిర్వహించిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ ఇన్‌చార్జ్ కిరణ్ రాయల్ మరోమారు టూరిజం స్కామ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం స్థానికులకు దర్శనభాగ్యం కల్పించలేదని, తిరుమలలో శారదాపీఠం అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టిందని, ఆ భవనాన్ని కూల్చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం శుభపరిణామమన్నారు. టీటీడీ జారీ చేసే టూరిజం టికెట్స్ వల్ల రూ.400 కోట్ల స్కామ్ జరిగిందని, నిన్న పాలకమండలి సమావేశంలో నిర్ణయాలన్నీ ఆ శ్రీనివాసుడే చెప్పించినట్లుగా తాను భావిస్తున్నట్లు తెలిపారు. టూరిజం స్కామ్‌లో సీఐడీ విచారణ చేపట్టి.. రోజాను నగరి జైలుకే పంపిస్తామని విమర్శించారు.
ఇక శ్రీరెడ్డి గురించి మాట్లాడుతూ.. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో ఇష్టారీతిన మాట్లాడిన శ్రీరెడ్డి ఇప్పుడు సారీలు చెబుతోందన్నారు. శ్రీరెడ్డి నోటి మాటల్లో ఇప్పుడున్నంత ఆవేదన నాడు లేదన్నారు. అందుకే ఏదైనా మాట్లాడే సమయంలో ఆలోచించి మాట్లాడాలని, అన్నీ చేసి ఇప్పుడు సారీలు చెప్పడం దేనికి సంకేతమన్నారు. హద్దులు దాటిన సోషల్ మీడియా యాక్టివిస్టులపై పోలీసులు చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో శ్రీ రెడ్డిలో వణుకు మొదలై సన్యాసి వేషం వేస్తోందన్నారు.
మొత్తం మీద కిరణ్ రాయల్ మాటలను బట్టి మాజీ మంత్రి రోజాకు ఇక చిక్కులేనని రాజకీయ విమర్శకులు తెలుపుతున్నారు. అలాగే సీఐడీ విచారణ సాగితే, అసలు కథ బయటపడితే.. ఆ తర్వాత చర్యలు తప్పవని జనసేన నేతలు అంటున్నారు.
జనసేన పార్టీ తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్ ప్రెస్మీట్
గత వైసీపీ ప్రభుత్వం స్థానికులకు దర్శనభాగ్యం కల్పించలేదు
తిరుమలలో శారదాపీఠం అనుమతులు లేకుండా అక్రమ కట్టడాలు కట్టింది
ఆ భవనాన్ని కూల్చేయాలని టీటీడీ పాలకమండలి నిర్ణయించడం శుభపరిణామం
టీటీడీ జారీ చేసే టూరిజం టికెట్స్ వల్ల… pic.twitter.com/7eKlnjJOnC
— BIG TV Breaking News (@bigtvtelugu) November 19, 2024