Samantha: సమంత ఇటీవల కాలంలో సినిమాల కంటే కూడా తన వ్యక్తిగత విషయాల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు. సమంత (Samantha) నాగచైతన్యకు(Nagachaitanya) విడాకులు ఇచ్చిన తర్వాత మరొక దర్శకుడు రాజ్ నిడుమోరి (Raj Nidumoru)తో కాస్త చనువుగా ఉంటున్న సంగతి తెలిసిందే .ఎక్కడికి వెళ్ళినా వీరిద్దరూ జంటగా కలిసి వెళ్లడంతో వీరి రిలేషన్ గురించి ఎన్నో రకాల వార్తలు బయటకు వచ్చాయి. వీరిద్దరూ రిలేషన్లో ఉన్నారని, త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారు అంటూ వీరిపై ఎన్నో రకాల వార్తలొచ్చిన వీరిద్దరూ ఎక్కడ స్పందించలేదు.
ఇక సోషల్ మీడియా వేదికగా సమంత షేర్ చేసే ఫోటోలు మాత్రం సంచలనగా మారుతున్నాయి. తాజాగా సమంత తన స్నేహితులతో కలిసి ఒక వేడుకలో పాల్గొన్నారు. సమంత తన పెర్ఫ్యూమ్ బ్రాండ్ సీక్రెట్ ఆల్కెమిస్ట్ లాంచ్ కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. అయితే ఈ ఫోటోలలో భాగంగా సమంత రాజ్ కు సంబంధించిన ఫోటోలు మాత్రం సంచలనంగా మారాయి. సమంత రాజ్ ను హగ్ చేసుకుని చాలా చనువుగా కనిపించడంతో ఈ ఫోటో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటోపై అభిమానులు విభిన్న రీతిలో స్పందిస్తున్నారు. సమంత ఈ ఒక్క ఫోటోతో వీరిద్దరి రిలేషన్ కన్ఫర్మ్ చేసినట్టేనా అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది కాస్త గ్యాప్ ఇవ్వొచ్చు కదా సమంత.. మరి అంత చనువు ఏంటి అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ఫోటో పై మరి కొంతమందికి వారి అభిప్రాయాలను తెలియజేస్తూ.. తరచు ఇలా వార్తలలో నిలవడం కంటే రిలేషన్ కన్ఫామ్ చేయొచ్చు కదా అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సమంత డైరెక్టర్ రాజ్ తో తన రిలేషన్ కన్ఫామ్ చేస్తుందా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక సమంత రాజు డైరెక్షన్ లో ది ఫ్యామిలీ మెన్ 2 సిరీస్ లో నటించిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి వీరిద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడటం ఆ పరిచయం కాస్త ప్రేమగా మారిందని తెలుస్తోంది. ఇక ఈయన కారణంగానే సమంత నాగచైతన్య విడాకులు తీసుకున్నారనే వార్తలు కూడా ఒకానొక సమయంలో తెరపైకి వచ్చాయి.
ఇక సమంత కెరియర్ విషయానికి వస్తే ఇటీవల ఈమె సినిమాలను తగ్గించినా పలు బిజినెస్ లను నిర్వహిస్తూ బిజినెస్ ఉమెన్ గా దూసుకుపోతున్నారు. ఇప్పటికే సమంత సాకీ అనే బ్రాండ్ తో దుస్తుల వ్యాపారంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తాజాగా ఈమె ఆల్కెమిస్ట్ అనే పెర్ఫ్యూమ్ బ్యాండ్ కూడా ప్రారంభించారు. వీటితోపాటు ట్రాలాల అనే నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించి నిర్మాతగా కూడా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం సమంత నందిని రెడ్డి డైరెక్షన్ లో మా ఇంటి బంగారం అనే సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమా పూజ కార్యక్రమాలను జరుపుకుంది. అయితే ఈ సినిమా సమంత ఈ సినిమాను తన సొంత నిర్మాణ సంస్థలోని చేస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: Akhanda Thaandavam Promo: అఖండ తాండవం ప్రోమో వచ్చింది… శివతాండవమే!