Comedian Satya: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మోస్ట్ టాలెంటెడ్ నటులలో సత్య ఒకడు. కానీ సత్య ను పూర్తిస్థాయిలో వాడుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. మత్తు వదలరా సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు రితీష్ రానా. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ సాధించింది. ఆ సినిమా తర్వాత హ్యాపీ బర్త్డే అనే సినిమా చేశాడు. ఆ సినిమా ఊహించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.
మత్తు వదలరా సినిమాకి సీక్వెల్ గా తీసిన మత్తు వదలరా 2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ సినిమాతో సత్యకు విపరీతమైన పేరు వచ్చింది. రితీష్ రానా తప్ప సత్యాన్ని సరిగ్గా ఎవరు వాడుకోవట్లేదు అని అందరికీ అర్థమైంది. ముఖ్యంగా సత్య టైమింగ్ అదిరిపోతుంది.
చాలామంది కమెడియన్స్ హీరోలుగా కూడా సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. ఇప్పుడు కమెడియన్ సత్య కూడా హీరోగా సినిమా చేస్తున్నాడు. వెన్నెల కిషోర్ మరియు కమెడియన్ సత్యా కలిసి రితీష్ రానా దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన పూజ నేడే పూర్తయింది.
ఈ సినిమా ఒక కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ గా ఉండబోతుంది. రితీష్ రానా కామెడీ టైమింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఎస్.ఎస్ రాజమౌళి కూడా ఒక సందర్భంలో రితీష్ రానా గురించి మాట్లాడుతూ వెటకారం మామూలుగా ఉండదు. చూడండి ఈ సినిమాకి సంబంధించి అన్ని లాంగ్వేజ్ లో కూడా పాన్ ఇండియా తెలుగు ఫిలిం అని వేశాడు.
చాలామంది కమెడియన్స్ హీరోలు అయిపోయిన తర్వాత చేసిన కొన్ని సినిమాలు వర్కౌట్ అయ్యాయి. అయితే కేవలం హీరో పాత్రలకు పరిమితం కాకుండా ఏ పాత్ర ఇచ్చిన చేసుకుంటూ పోవాలి అనే మైండ్ సెట్ వాళ్ళలో ఉంటేనే ఎక్కువకాలం ఇండస్ట్రీలో ఉండగలరు.
ప్రస్తుతం పవన్ ఇండియా విలన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు సునీల్. కమెడియన్గా కెరియర్ స్టార్ట్ చేసిన సునీల్ ఒక తరుణంలో హీరోగా మారిపోయాడు. మీరు కూడా మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేశాడు. అయితే హీరోగా సునీల్ సినిమాలు వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ కామెడీ మీద దృష్టి పెట్టి కొన్ని సినిమాల్లో కనిపించాడు. అదే తరహాలో సత్య కూడా చేస్తాడేమో చూడాలి.
Also Read: Harish Shankar: వార్తలన్నీ అబద్ధాలేనా, త్రివిక్రమ్ తో హరీష్ ఇంత క్లోజ్ గా ఉంటాడా?